కడప: వేముల మండలం తుమ్మలపల్లెలో నిర్మించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నిభారత అణుశక్తి సంఘం చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ శుక్రవారం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆల్కైన్ లీచింగ్ పద్ధతిలో దేశంలోనే మొదటిసారిగా వైఎస్సార్ జిల్లాలో యురేనియం శుద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఉండదని, పర్యావరణానికి ముప్పు వాటిల్లదని ఆయన పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.పూర్తి వివరాలు ...
(విజయభాస్కర్ తవ్వా ) “టీం ఔటింగ్ ఎప్పుడు?” జట్టు సమావేశమైన ప్రతీసారి ఆనంద్ తెచ్చే ప్రస్తావన… ‘ఎన్నో రోజుల నుండి ప్రయత్నించి విఫలమైనా ఈ సారి జట్టుగా ఔటింగ్ కు వెళ్ళాలి. బాగా ప్లాన్ చెయ్యాలి.’ ఆనంద్ ఊటీ పేరు ప్రతిపాదిస్తే, శ్వేత కేరళ అంది. ప్రతీ మంగళవారం జరిగే జట్టు సమావేశంలో ఈ సారి నేనే ప్రస్తావన తెచ్చాను – ‘టీం ఔటింగ్ కి ఎక్కడి వెళ్దాం?’ అని. “ఏదైనా సరే నేను రెడీ – […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: కౌసల్య దశరథమహారాజు తనయుడు శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తనయ సీతామహాదేవితో స్వస్తిశ్రీ శ్రీనందననామ సంవత్సర ఉత్తరాయణే, వసంత రతువే, చైత్రమాసే చతుర్ధశి గురువారం సరియగు 5వ తేదీ రాత్రి 10 గంటలకు కల్యాణం జరుగులాగున దేవదేవులు నిర్ణయించారు. అత్యంత వైభవంగా, కనుల పండువగా నిర్వహించనున్న శ్రీరామచంద్రమూర్తి కల్యాణోత్సవానికి వీక్షించి, పులకించ మనవి.పూర్తి వివరాలు ...
అపర అయోధ్యగా కొనియాడబడుతున్న ఏకశిలానగరం ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి పురాణ, చారిత్రక విశేషాలున్నాయి. బహుళ ప్రచారంలో ఉన్న కథనాల కన్నా మరింత ఆసక్తిదాయకమైన విశేషాలు కూడా ఉన్నాయి. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు … ఒంటిమిట్టలో మాత్రమే… రాత్రిపూట కల్యాణం సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ దేవతామూర్తుల కల్యాణోత్సవాలను పగలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రం లో మాత్రమే రాత్రి 11 గంటల తర్వాత నిర్వహిస్తారు. దీనికో పురాణగాథ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. […]పూర్తి వివరాలు ...
‘ఏమానందము భూమీతలమున శివతాండవమట.. శివలాస్యంబట! వచ్చిరొయేమో వియచ్ఛరకాంతలు జలదాంగనలై విలోకించుటకు ఓహోహోహో.. ఊహాతీతము ఈయానందము ఇలాతలంబున..!’ సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు అగస్తేశ్వరస్వామి ఆలయంలో 18 రోజుల్లో రాసిన ‘శివతాండవంలోనివి ఈ పంక్తులు’. సంగీతం, సాహిత్యం మిళితమై నాట్యానికనుగుణంగా ఉన్న ఈ రచన ఆయనకు అనంత కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది.పూర్తి వివరాలు ...
కడప : ఆహ్వానం టెలీ సీరియల్‌కు సంబంధించి ఈనెల 17వతేదీవరకు కడప నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు. ప్రారంభ సన్నివేశాలను శనివారం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయంలో సినీనటుడు మురళీమోహన్‌పై చిత్రీకరించారు. ప్రార్థనా సన్నివేశాన్ని శ్రీవారి పాద మండపం వద్ద చేశారు. సీరియల్‌లో కథానాయకి నవ్యశ్రీ, శ్రీరామ్ తదితరులపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిరంజీవి చిత్రీకరించారు. రమా ఫిలిమ్స్ బ్యానర్‌పై 10ఎపిసోడ్ల టెలిఫిలిం నిర్మిస్తున్నామని నిర్మాత మోపూరి వెంకటసుధాకర్ తెలిపారు. మురళీమోహన్‌ను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు. […]పూర్తి వివరాలు ...
విమాన సర్వీసులను నడిపేందుకు దరఖాస్తు చేసుకున్న పలు విమానయాన సంస్థలు ఆగస్టు 15 నుంచి సర్వీసుల ప్రారంభం? కడప: మీరు కడప నుంచి తిరుపతికి విమానంలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే మరో నాలుగు నెలలు ఆగండి. తిరుపతికే కాదు… కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబయి, న్యూఢిల్లీలాంటి మహానగరాలకూ వెళ్చొచ్చు. కడపలో కొత్తగా నిర్మించబోయే ఏయిర్‌పోర్టు పనులు చివరి దశలో ఉన్నాయి. జూన్ చివరికల్లా విమానాల రాకపోకలకు ‘కడప ఏయిర్‌పోర్టు’ సిద్ధంగా ఉంటుంది.పూర్తి వివరాలు ...
భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...