వార్తా విభాగం

ప్రత్యేక వార్తలు

జేసీ దివాకర్‌రెడ్డికి, పులివెందులకు ఉన్న సంబంధం…

కోవరంగుంటపల్లె: ప్రముఖుల పుట్టినిల్లుగా పేరొందిన కోవరంగుంటపల్లెకు స్వాతంత్య్ర సమర యోధుల గడ్డగా కూడా పేరుంది. కడప గాంధీగా పేరొందిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి స్వగ్రామం ఇదే. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈయన ఇంగ్లాండ్‌లో బారిష్టర్ చదివారు. గాంధీ ఆశయాలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. స్వాతంత్య్రం కోసం జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి ఒక ఏడాది పాటు జైలులో ఉంచారు. రామసుబ్బారెడ్డి జైలు నుంచి విడుదలయిన కొద్ది రోజులకే గాంధీ విదేశీవస్తు […]పూర్తి వివరాలు ...

వార్తలు

బ్రహ్మణి స్టీల్స్‌ను ఆపొద్దు …

కడప: రాయలసీమ ప్రజల ఉపాధికి అవకాశాలున్న బ్రహ్మణి స్టీల్స్‌ను రాజకీయాలతో ముడిపెట్టి అడ్డుకోవద్దని రాయలసీమ కార్మిక, కర్షక సమితి డిమాండ్ చేసింది. వెనుకబడిన రాయలసీమ, ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్దేశించిన ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి ఆరోపించింది. స్థానిక ప్రజల ఉపాధి కోసం తలపెట్టిన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా పార్టీలకు అతీతంగా అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు […]పూర్తి వివరాలు ...

వార్తలు

జిల్లాపై వివక్ష తగదు : సీపీఎం

బద్వేలు:  వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం పాలకులు రాజకీయ కుట్రలతోనే జిల్లాకు నిధులను నిలిపివేశారని సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. రాజకీయ కుట్రలతోనే జిల్లా అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నేతలు ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. బద్వేలులో నిర్వహించిన ఆ పార్టీ 8వ జిల్లా మహాసభలు గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవిశంకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…పూర్తి వివరాలు ...

కైఫియత్తులు చరిత్ర

‘పోలి’ గ్రామ చరిత్ర

జిల్లా చరిత్ర పుటల్లో పోలి గ్రామానికి ప్రత్యేకస్థానం ఉంది. రాజంపేట పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ఓ స్త్రీ (పోలి) తన బిడ్డను త్యాగం చేసి యజమాని వంశాన్ని నిలబెడితే, మరో స్త్రీ(సగలక్క) ఆత్మబలిదానం చేసుకుని పోలి గ్రామస్తులను కాపాడింది. ఇదంతా 11వ శతాబ్దం నాటి యథార్థ గాథ అని, ఈ వివరాలన్నీ కడప కైఫీయత్తుల్లో వెలుగు చూశాయని చరిత్రకారులు అంటున్నారు. రాజంపేట పట్టణ పరిధిలో ఉన్న పోలి […]పూర్తి వివరాలు ...

వార్తలు

జగన్ పై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు

పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రహ్మతుల్లా కేసు విషయంలో నిన్న రాత్రి పులివెందుల పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేసిన కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 68మందిపై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వీరిపై 11 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. రహ్మతుల్లా అనే పార్టీ కార్యకర్తను పోలీసులు దూషించటంతో పాటు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 […]పూర్తి వివరాలు ...

వార్తలు

9 నుంచి 11 వరకు కడపలో జగన్

కడపః ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో అందుబాటులో ఉంటారు. 9,11 వ తేదీలలో పులివెందులలోని తన క్యాంపు కా ర్యాలయంలో అందుబాటులో ఉంటారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారని పులివెందుల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత  వై.ఎస్.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైన సమయంలోనే జగన్ పర్యటన ఖరారవడం విశేషం.పూర్తి వివరాలు ...

వార్తలు

9న ప్రొద్దుటూరుకు రానున్న ముఖ్యమంత్రి

ప్రొద్దుటూరు: ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రొద్దుటూరుకు రానున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ బుధవారం సాయంత్రం స్థానిక అధికారులతో కలిసి హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. మొదట గోపవరం గ్రామ పంచాయతీలోని కొర్రపాడు రోడ్డు రింగ్ రోడ్డు వద్ద ఉన్న అపెరల్ పార్కు దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాన్ని, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు.పూర్తి వివరాలు ...

వ్యవసాయం

పంటల సాగు వివరాలు – కడప జిల్లా

జిల్లాలో సగటున 10 లక్షల 8 వేల ఎకరాల సాగు భూమి ఉండగా సగటున 9 లక్షల 81 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. వరి, వేరుసెనగ, కంది, సెనగ, అలసందలు జిల్లాలో సాగు చేసే ప్రధాన ఆహార పంటలు. పసుపు, చెరకు, ప్రత్తి, ఉల్లి, పొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప, టమోటా తదితరాలైన వాణిజ్య పంటలు సాగవుతాయి. సాగు భూమిలో సుమారుగా 5 శాతం మేరకు వాణిజ్య పంటలు సాగవుతాయి. జిల్లా వ్యాప్తంగా 52 శాతం […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

అద్వితీయ ప్రతిభాశాలి పుట్టపర్తి

తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. 20 సంవత్సరాల కిందట ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసరచయిత ఇట్లా రాశాడు. ‘‘పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో […]పూర్తి వివరాలు ...

error: