వార్తా విభాగం

వ్యాసాలు

రాయలసీమ కథలకు ఆద్యులు (వ్యాసం) – వేంపల్లి గంగాధర్

నాలుగు జిల్లాల రాయలసీమ. రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం. వర్షాల్లేక బీడు పడిన భూములు, సాగునీరు, తాగునీరు లేక అల్లాడే గ్రామాలు, రాజకీయ నాయకులతో పాటూ పెరుగుతున్న ఫ్యాక్షన్ కక్షలు వీటన్నిటి వలయాల మధ్యనుంచి సీమ కథా సాహిత్యం నిర్మితమవుతూ వచ్చింది. కరువు, కక్షలు, దళిత, స్ర్తి, రాజకీయ, ప్రేమ కథలు ఎన్నో యిక్కడినుంచి విస్తృతంగా వెలువడ్డాయి. సీమ సంస్కృతి మిశ్రమ సంస్కృతి. ఈ నేపథ్యంలో సీమలోని నాలుగు (అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప) […]పూర్తి వివరాలు ...

కథలు సాహిత్యం

నవ వసంతం (కథ) – తవ్వా ఓబుల్ రెడ్డి

విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి కేక వేసినాడు. ”గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా” అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి. ”అబ్బెబ్బే… అదేం లేదులేబ్బా… నరాల జబ్బుతో సేతులు వణుకుతాండయ్‌” సంజాయిషీ చెప్పుకున్నాడు గంగులయ్య.పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నరులారా నేడువో నారసింహ జయంతి — అన్నమాచార్య సంకీర్తన

నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను || సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివారం మందు సంధ్యాకాలమున ఔభళేశుడు | పొందుగా కంభములో పొడమి కడప మీద కందువ గోళ్ళ చించె కనక కశిపుని || నరమృగరూపము నానాహస్తముల అరిది శంఖచక్రాది ఆయుధాలతో గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచె గురుతర బ్రహ్మాండ గుహలోనను || కాంచనపు గద్దెమీద గక్కున కొలువైయుండి మించుగ ఇందిర తొడమీద బెట్టుక | అంచె శ్రీవేంకటగిరి […]పూర్తి వివరాలు ...

కథలు

రాములవారి గుడి ముందు (కథ) – డా|| ఎల్‌.విజయమోహన్‌రెడ్డి

పుస్తకాల సంచీ బీరువా కింద దాచేసి, సరాసరి వంటింట్లోకి వెళ్ళబోయి, అంతగా పరుగెత్తుకొచ్చినందుకు అత్తయ్య కోప్పడుతుందేమోనన్న విషయం గుర్తొచ్చి గుమ్మంలోనే ఆగిపోయి లోపలికి తొంగి చూశాడు శివు. రంగమ్మ రొట్టెలు చేస్తూంది. చాలా సేపట్నుంచీ పొయ్యిముందు కూర్చుని పనిచేయడం వల్ల ఆమె ముఖమంతా చెమటతో తడిసివుంది. నొసటి కుంకుమ కరిగి ముక్కుమీదుగా కారి చార ఏర్పడింది. ముఖంమీది చెమట బిందువులు పొయ్యి వెలుగులో కెంపల్లా మెరుస్తున్నాయి.పూర్తి వివరాలు ...

అభిప్రాయం

కడపలో ఓటుకు ఎంత పంచారు?

ఉప ఎన్నికల ఫలితాలపై ‘ఆ ముగ్గురికే పట్టం’ పేరుతొ కడప జిల్లా టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించిన ఈనాడు దినపత్రిక అందులో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. ఈనాడు కధనం ప్రకారం రాయచోటి, రాజంపేట, రైల్వేకొడూరులలో తెదేపా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులు ఓటుకు ఐదు వందలనుంది వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్తులు రెండు వందల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కాంగ్రెస్, తెదేపా అభ్యర్తులు బాగా నగదు పంపిణీ చేసినప్పటికీ ఓటర్లు […]పూర్తి వివరాలు ...

వార్తలు

రాయచోటిలో వైకాపా రికార్డు

రాయచోతిలో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీగా వైకాపా రికార్డు సృష్టించింది.  ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి… టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాయచోటిలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. రాయచోటిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో సహా మొత్తం పోలైన ఓట్లు 1,59,201. అభ్యర్థికి ధరవతు రావాలంటే ఇందులో ఆరింట ఒక వంతు ఓట్లు అంటే 26,533 ఓట్లు దక్కాలి. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి 25,344 […]పూర్తి వివరాలు ...

వార్తలు

వైకాపాకు కొమ్ము కాసిన అధికార యంత్రాంగం – ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

అధికార యంత్రాంగం మొత్తం వైకాపాకు అనుకూలంగా పనిచేశారని కడప జిల్లా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేయడం విశేషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున డి.సి.సి అధ్యక్షుడు మాకం అశోక కుమార్ దీనికి సంబంధించి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం ఆసక్తికరంగా ఉంది. జిల్లాలో మంగళవారం జరిగిన రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల ఉపఎన్నికల పోలింగ్‌లో పలువురు అధికారులు, ఉద్యోగులు ఏకపక్షంగా వ్యవహరించారని, ఆ మూడు నియోజకవర్గాల్లో అధికార […]పూర్తి వివరాలు ...

వార్తలు

బారులు తీరిన ఓటర్లు – భారీ పోలింగ్ నమోదు

స్వల్ప సంఘటనలు మినహా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంల ఏర్పాటులో తలమునకలయ్యారు. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్ల ఉత్సాహం కొనసాగింది. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి […]పూర్తి వివరాలు ...

error: