కథానిక, నవల, నాటకం ఏదైనా తెలుగు సాహిత్యం సామాజిక చైతన్యానికి- రుగ్మతలు రూపుమాపటానికి ఉపయుక్తమవుతుందని తెలుగు శాఖ సహ ఆచార్యుడు తప్పెట రామప్రసాద్‌రెడ్డి వివరించారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. మూఢాచారాలను రూపుమాపేందుకు సాహిత్యం ఆయుధమన్నారు. 21వ శతాబ్ది సాహిత్యం మరింత పదునైన ఆయుధంగా రూపుదిద్దుకొంటోందని సంతృప్తి వ్యక్తం చేశారు. సమాజం మరింత పురోభివృద్ధి చెందటానికి తనవంతు పాత్ర […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలోని అమీన్ పీర్ (పెద్ద) దర్గాలో హజరత్ సూఫిసర్ మస్త్‌షా చిల్లాకష్ ఖ్యాజా సయ్యద్ షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాలు కొద్ది సేపటి క్రితం ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మలంగ్‌షాను పీరి మీద పీఠాధిపతి ఆసీనులు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కళకళలాడింది. ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రస్తుత పీఠాధిపతి రాత్రి 10 గంటలకు గంధం సమర్పించి […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు రెండో రోజు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లో కొనసాగింది. ఈ సదస్సులో తెలుగుశాఖ సమన్వయకర్త ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను జీవన మార్గాలనే మార్చివేసేంతగా సాహిత్యం ప్రభావం చూపిందన్నారు. రైతులు నేత కార్మికులు ఇతర వృత్తి కారులు జీవన విద్వంసానికి గురయ్యారన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికరంగం మనిషిని మనిషిగా బతకనీయకుండా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. పేదలు- ధనికులకు మధ్య పెరుగుతున్న అంతరం […]పూర్తి వివరాలు ...
వైకాపా తరపున కడప మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్తమద్ది సురేష్‌బాబు నిన్న (బుధవారం) నామినేషన్ దాఖలు చేశారు. ఆయన చిన్నచౌకు పరిధిలోని నాలుగో డివిజన్ కార్పోరేటర్ పోటీ కోసం నామినేషన్ పత్రాలు సమర్పించారు. అట్టహాసంగా కార్యక్రమం సాగింది. ఆయన భార్య జయశ్రీ మరోసెట్ నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, పార్టీ నగర కన్వీనర్ అంజద్‌బాష, వైఎస్ అవినాష్‌రెడ్డి, […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజులురెడ్డి ఆఖరికి తెదేపా గూటికి చేరారు. బుధవారం ప్రొద్దుటూరులో తెదేపా నాయకులతో కలిసి విలేఖరుల సమావేశంలో వరద పాల్గొన్నారు. సుదీర్ఘమైన రాజకీయానుభవం కలిగిన వరద సీఎం రమేష్ సమక్షంలో తెదేపా సమావేశంలో పాల్గొనడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. కనీసం చంద్రబాబు సమక్షంలో తెదేపా గూటికి చేరాల్సిన వరద సాదాసీదాగా పోట్లదుర్తికి చెందిన రమేష్ సమక్షంలో ఆ పార్టీకి జై కొట్టడం ఆయన అభిమానులకు ఇబ్బందిగా మారింది. ఈ సందర్భంగా పట్టణంలోని బద్వేలు […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ’21వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లోని సదస్సుల గదిలో బుధవారం మొదలైంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సమాజ కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆచార్య కుసుమకుమారి మాట్లాడుతూ వికీపిడియా వంటి వెబ్‌సైట్‌లు వేల పుటల్ని సాహిత్య అభిమానులకు అందిస్తున్నాయని వివరించారు. అలాంటి మాధ్యమాలను తెలుగు రచయితలు, పరిశోధకులు తప్పక ఉపయోగించుకోవాలన్నారు. […]పూర్తి వివరాలు ...
కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని డిఎల్ తన అనుచరులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నిర్వహిస్తానని వివరించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పరస్పర సహకారంతో పయనించాం. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. మీ సహకారానికి కృతజ్ఞతలు. రాజకీయంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ మంగళవారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం. ఖాజీపేటలో ఈనెల […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే వైకాపా అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ రఘురామిరెడ్డి కడపలో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతంలో వైకాపా 130 శాసనసభ, 23 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ అభ్యర్థులు: లోక్‌సభ అభ్యర్థులు:పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. [feed url=”http://www.www.kadapa.info/villages/category/proddatur/పూర్తి వివరాలు ...