వార్తా విభాగం

వార్తలు

సీమ కోసం బడి పిల్లోళ్ళు రోడ్డెక్కినారు

రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ పొద్దు (మంగళవారం) కడప నగరంలో బడిపిల్లోల్లు రోడ్డు మీదకొచ్చారు. నగరంలో ప్రదర్శన నిర్వహించిన పిల్లోళ్ళు… ర్యాలీగా కోటిరెడ్డి కూడలి వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేఖిస్తూ నినాదాలు చేశారు. రాయలసీమ విద్యార్థి సమాఖ్య (ఆర్ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాజధాని విషయంలో సీమ వాసుల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘సీమ కోసం సభలో నోరెత్తండి’

కడప:  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందున సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో గళం విప్పాలని, సీమలో రాజధాని ఏర్పాటుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీమ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలన్నారు. సీమకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీని వేదికగా చేసుకొని […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

రాజంపేట మండలాధ్యక్షురాలిపై అనర్హత వేటు

రాజంపేట: విప్‌ను ధిక్కరించి తెదేపాకు ఫిరాయించిన రాజంపేట మండలపరిషత్తు అధ్యక్షురాలు సుహర్లతపై అనర్హత వేటు పడింది. ఈమె ఏప్రిల్‌లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మండలంలోని వూటుకూరు-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరుపున పోటీచేసి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో తెదేపా ప్రలోభాలకు లొంగి ఈమె వైకాపా నుండి ఫిరాయించి లాటరీ పద్ధతిలో తెదేపా తరపున ఎంపీపీగా ఎన్నికయ్యారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించడం వల్ల వైకాపా నాయకులు ఎన్నికల కమిషన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు విచారణ […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

మన జయరాం, మన సొదుం

మధ్య తరగతి ఆలోచనల్ని భూ మార్గం పట్టించిన కథాశిల్పి సొదుం జయరాం. వీరికి 2004లో రాచకొండ రచనా పురస్కారం శ్రీకాకుళంలోని కథానిలయం వార్షికోత్సవ సభలో ఫిబ్రవరి 15న అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి మిత్రుడు జయరాం గురించి అందిస్తున్న రచన… నాలుగైదు దశాబ్దాల కిందటి మాట. కడప జిల్లాలోని పల్లెటూళ్ళలో ఆధునిక సాహిత్య చైతన్యం అబ్బిన రైతు కుటుంబాలు చాలా తక్కువగా ఉండేవి. వీటిలో సొదుం జయరాం […]పూర్తి వివరాలు ...

వార్తలు

ప్రొద్దుటూరులో కదం తొక్కిన విద్యార్థులు

వాళ్లంతా బడికి పోయే పిల్లోళ్ళు … కాలేజీకి పోయే యువతరం… అందరూ ఒక్కటై, ఒకే గొంతుకై వినిపించినారు రాయలసీమ ఉద్యమ నినాదం. ఆ నినాదం వెనుక దగాపడిన బాధ, పైకి లేవాలన్న తపన… అందుకు పోరు బాట పట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోరుగిత్తలు ఇచ్చిన ఈ పిలుపు మహోద్యమమై సీమ పాలిటి సైంధవులకు శరాఘాతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.  (ప్రొద్దుటూరు నుండి వనం దత్తప్రసాద్ శర్మ అందించిన ప్రత్యేక కథనం) రాయలసీమకు రాజధానిని రేపటి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

వీళ్ళు పన్ను ఎందుకు కట్టటం లేదో?

కడప కార్పోరేషన్ పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా పన్ను కట్టకుండా తిరుగుతున్న కొంతమంది వ్యక్తులు, సంస్థల పేర్లను ఒక దినపత్రిక ఈరోజు ప్రచురించింది. సదరు కధనం ప్రకారం పన్ను కట్టనివాళ్ళ జాబితా ఇదే… ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ రూ.81 లక్షల 77వేల 282, ఫాతిమా ఇంజనీరింగ్‌ కాలేజ్‌ రూ.14 లక్షల 77 వేల 392 నిర్మలా హాస్పిటల్‌ అండ్‌ క్వార్టర్స్‌ రూ.19 లక్షల 11 వేలు సరస్వతి విద్యాలయం రూ.12 లక్షల 86 వేల 714 దేశం […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఈరోజు కడపకు రానున్న ఇన్చార్జి మంత్రి

జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖామంత్రి రావెల కిశోర్‌బాబు ఈ రోజు జిల్లాకు వస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి రోడ్డుమార్గాన రాజంపేటకు బయలుదేరి మధ్యాహ్నం గం.1.30కు చేరుకొని, స్థానిక ర.భ.శాఖ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం గం.4.00కు కడపకు చేరుకొని, అక్కడి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే బసచేసి 15న కడపలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు […]పూర్తి వివరాలు ...

వార్తలు

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ కాల్చిన విద్యార్థులు

ప్రొద్దుటూరు: రాయలసీమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు (బుధవారం) విద్యార్థులు స్థానిక పుట్టపర్తి సర్కిల్ లో ముఖ్యమత్రి దిష్టిబొమ్మను కాల్చినారు. రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో  పుట్టపర్తి సర్కిల్ వద్దకు చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. రాజధానితో సహా శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ… విజయవాడను తాత్కాలిక రాజధానిగా చెయ్యటం అన్నది ముఖ్యమంత్రి కుట్రలో భాగమన్నారు. హైదరాబాదు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఫిరాయించిన ముగ్గురు వైకాపా కౌన్సిలర్లపై అనర్హత వేటు

రాయచోటి : మునిసిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా విప్‌ ధిక్కరించినందుకు ముగ్గురు కౌన్సిలర్లపై మంగళవారం అనర్హత వేటు పడింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నరసింహులునాయక్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. మునిసిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్‌ అనీఫా, 12వ వార్డు కౌన్సిలర్‌ మహబూబ్‌బాష, 21వ వార్డు కౌన్సిలర్‌ షాహిరున్నీసాలపైన ఈ వేటు పడింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌లుగా పార్టీ బలపరిచిన అభ్యర్ధికి ఓటు వేయలేదంటూ వైకాపా నాయకులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి […]పూర్తి వివరాలు ...

error: