వార్తా విభాగం

    వార్తలు

    జగన్ బహిరంగ లేఖ

    ప్రతిపక్షం అదే. ఆరోపణలూ అవే. కానీ అసత్యాలంటూ ఒకపుడు వాటన్నిటినీ తిప్పికొట్టిన పాలక పక్షం… ఇపుడు ‘అవునా?’ అని ఆశ్చర్యం నటిస్తోంది. మనమే విచారిద్దాం… అంటూ సభా సంఘానికి సరేనంది. మొత్తమ్మీద అన్ని పక్షాలూ కలిసి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కారణం ఒక్కటే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు లేకపోవటం. ఆత్మగౌరవం కోసం నేను సోనియాగాంధీని ఎదిరించటం. ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్న ఈ కుట్ర అసలు లక్ష్యం వేరే ఉంది. అది… ఎల్లో […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    మే 8న కడప, పులివెందుల ఉప ఎన్నికలు

    ఏప్రిల్ 11న నోటిఫికేషన్.. మే 8న పోలింగ్.. మే 13న కౌంటింగ్ జిల్లాలో అమల్లోకి ఎన్నికల నియమావళి కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం నాలుగు రాష్ట్రాల్లోని ఐదు స్థానాలకు (రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు) ఉప ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఈ షెడ్యూలు ప్రకారం కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల […]పూర్తి వివరాలు ...

    వేమన పద్యాలు

    హిమధాముడు లేని రాత్రి హీనములు సుమతీ

    పికము వనములోన విలసిల్ల పలికిన భంగి ప్రాజ్ఞజనుల పలుకు గులుకు కాకి కూత బోలు కర్మబద్ధుల కూత విశ్వదాభిరామ వినురవేమ బుద్ధిమంతుల మాటలు తోటలోని కోకిల స్వరంలాగ మనోహరంగా ఉంటాయి. కాని అల్ప బుద్ధుల మాటలు అట్లా కాదు. కాకి కూతల్లా కర్ణ కఠోరంగా ఉంటాయంటున్నాడు వేమన. ప్రాజ్ఞుడు అంటే పండితుడు. అతడు కర్మదూరుడు. అంటే కర్మల్లో చిక్కుపడనివాడు. కోకిల లాగ మధురంగా మాట్లాడుతాడు. రెండోవాడుపూర్తి వివరాలు ...

    వేమన పద్యాలు

    ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా..

    తుంట వింటి వాని తూపుల ఘాతకు మింటి మంటి నడుమ మిడుక తరమె? ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ   కుటుంబ వ్యవస్థ లోపల గాని, బయటగాని విరహం విరహమే. ఈ భూమ్యాకాశాల మధ్య విరహమంతటి దుస్తర బాధ లేదని అంటున్నాడు వేమన. వేమన జీవితంలోని పరిణామాన్ని ఈ పద్యం సూచిస్తుందేమో తెలియదు. గతంలో భర్తతో సయోధ్య లేని భార్య గురించి అనేక పద్యాలు చెప్పాడు. వేశ్యా జీవితాలనుపూర్తి వివరాలు ...

    చరిత్ర

    గాంధీజీ కడప జిల్లా పర్యటన (1929)

    1929 (౧౯౧౯౨౯) మే 17 వ తారీఖున గాంధీజీ కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరినారు. మహాత్మా గాంధి అమ్మవారిశాలను సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు. ఈ అన్ని చోట్లా గాంధీజీని అత్యంత ఉత్సాహముతో ఆదరించి సన్మానించారు. ముద్దనూరులో…  గాంధీజీ రాత్రి 9 గంటలకు ముద్దనూరు చేరినారు. ముద్దనూరులో గాంధీజీ దర్శనార్థం , అక్కడకు 12 మైళ్ళ దూరములో ఉన్న జమ్మలమడుగు […]పూర్తి వివరాలు ...

    కైఫియత్తులు

    వాల్మీకి మహాముని ఆశ్రమం అని చెప్పుకోబడిన స్తలమందు వనిపెంట

    రాయించినది: కుల్కరిణీ శంకరప్ప నల్లమల పర్వతమందు ఉన్న అహోబిల నారసింహ క్షేత్రానికి దక్షిణ భాగమున యోజన ద్వయ స్థలమున పూర్వము వాల్మీకి తపస్సు చేస్తూ ఉండేవాడు. అందువలన ఈ స్థలమును వాల్మీకి పురం అని ప్రజలు చెప్పుకుంటున్నారు… ఇటు తరువాత చోళ మహారాజు రాజ్యం చేసేటప్పుడు (కలియుగమందు కొంత కాలం జరిగిన తరువాత) నర్ర గొల్లలు అనే వాళ్ళు ఈ స్థలములో నర్రవుల మందలు ఆపు చేసుకుని ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఉండేటందుకు () గాను  కొట్టాలు […]పూర్తి వివరాలు ...

    వేమన పద్యాలు

    ముక్క వంకజూచి ముకురంబు దూరుట

    తనకు ప్రాప్తిలేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల ముక్క వంకజూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ దాత తనకు ద్రవ్య సహాయం చెయ్యటం లేదనే ఆక్రోశంతో అతన్ని నిందించటం అవివేకం. నిజానికి తనకా అదృష్టం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవడం ఎట్లా ఉంటుందంటే, తన ముక్కు వంకరగా ఉందని మర్చిపోయి, అద్దమే దానిని వంకర చేసి చూపించిందని తూలనాడినట్టు, అంటున్నాడు వేమన.పూర్తి వివరాలు ...

    వార్తలు

    పట్టుకు ప్రాకులాట: తెలుగుదేశం పార్టీతో మ్యాచ్‌ ఫిక్స్‌?

    కడప: జిల్లాలో జగన్‌గ్రూపును దెబ్బతీసేందుకు మంత్రుల బృందం ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పట్టుకోసం ప్రాకులాడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో మ్యాచ్‌ ఫిక్స్‌ంగుకు సిద్దపడుతున్నారు. జిల్లాలో రెండు రోజుల నుంచి నలుగురు మంత్రులు కన్నాలక్ష్మినారాయణ, డిఎల్‌ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, వివేకానందరెడ్డి తిష్టవేశారు. సాధ్యమైనంత మేరకు జగన్‌ గ్రూపుపై పట్టు సాధించేందుకు ప్రతిపక్షాలతో సైతం దోస్తీకి కాంగ్రెస్‌ సిద్దపడుతోంది.పూర్తి వివరాలు ...

    వార్తలు

    మార్చి 5,6 తేదీల్లో అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగజాతర

    కడప : రాయలసీమలో పేరొందిన అనంతపురం గంగజాతర శని, ఆదివారాల్లో జరగనుంది. జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. చాగలగట్టుపల్లె నుంచి ఉత్సవ విగ్రహం శనివారం ఉదయానికి జాతర ఆవరణం చేరుకోనుంది. భక్తుల చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారు, గొల్లపల్లె నుంచి మరో గంగమ్మ విగ్రహం జాతరలోకి చేరుకుంటాయి. ఏటా శివరాత్రి ముగిసిన రెండో రోజే జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ఒక రోజు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ కన్వీనర్‌ టి.పురుషోత్తంరెడ్డి, మేనేజరు […]పూర్తి వివరాలు ...