వార్తా విభాగం

వార్తలు

26,27,28 తేదిలలో తపాల బిళ్ళలు, నాణేల ప్రదర్శన

జూలై 26,27,28 తేదిలలో కడప నగరంలో తపాల బిళ్ళలు మరియు నాణేలు ప్రదర్శన జరుగనుంది.ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు.   TTD కళ్యాణ మంటపం లో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణేలు ప్రదర్శించ బడతాయి. ప్రవేశం ఉచితం. తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్ 20 పైగా స్టాల్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్బంగా  విద్యార్దులకు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

‘కాబోయే కలెక్టర్ అమ్మానాన్నలు’

పిల్లల్ని బడికి పంపడానికిపెద్దలు తాయిలం పెడతారు. అయితే మేఘనాథ్ తండ్రికి.. బడే తాయిలం అయింది! ‘పశువుల పని పూర్తి చేస్తేనే… ఇవాళ నీకు బడి…’ అని తండ్రి పెట్టే ఆశకు, చదువుపై ఉన్న ఇష్టానికి మధ్య… గొడ్ల చావిడిలో ఆయన బాల్యం నలిగిపోయింది! అదిగో అలా పడింది ఈశ్వర్‌రెడ్డి మనసులో… తన పిల్లల చదువు… తన చదువులా తాయిలం కాకూడదని. చదువే సర్వస్వం అన్నాడు. చక్కగా చదివించాడు. అందుకే… సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించిన మేఘనాథ్ సక్సెస్‌స్టోరీలో […]పూర్తి వివరాలు ...

వార్తలు

బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి

యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య బేతనభట్ల శ్యామ్‌సుందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు, డీన్‌లతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విశ్వవిద్యాలయంలోని కుటుంబసభ్యులందరినీ కలుపుకుని తన శాయశక్తులా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానని తెలిపారు. యోగి వేమన పేరుతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలో పనిచేయడం అదృష్టమన్నారు. ఆయన ప్రబోధనలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధికి పాటుపడతామన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగించి విశ్వవిద్యాలయానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడపలో నందమూరి కల్యాణ్‌రామ్

హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ రోజు (సోమవారం) కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దర్గాను దర్శించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, కుదరడంలేదని, ఇప్పుడు స్వామి అనుగ్రహం కలగడంతో దర్శించుకున్నానని కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. తాను నటించి, నిర్మించిన చిత్రం ‘ఓం’ ఈనెల 19న విడుదల కానుందని ఆయన తెలిపారు.పూర్తి వివరాలు ...

వార్తలు

యోగివేమన విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతి

యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) నూతన ఉపకులపతిగా ఆచార్య డా. బి. శ్యాంసుందర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఈయన నాగార్జున విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు పలు కీలకపదవులు నిర్వహించారు. ఆరునెలలుగా ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్ పదవికి పలువురు పోటీపడ్డారు. ఆచార్య శ్యాంసుందర్ నియామకానికే గవర్నర్ మొగ్గుచూపడంతో వైవీయూ మూడో వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఆచార్య శ్యామ్‌సుందర్‌ […]పూర్తి వివరాలు ...

కథలు

యంగముని వ్యవసాయం (కథ) – ఎన్. రామచంద్ర

యంగమునివ్యవసాయంకథ మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, పారతో యంగముని, పంగలకర్ర, మచ్చుగత్తి, ప్లాస్టిక్‌ బిందెతో సావిత్రి, టైర్‌ లేయర్‌తో చేసిన ఆకు చెప్పలు వేసుకుని చీకటి విచ్చీ విచ్చకముందే ఒకవిడత ఉప్పుతో ఊరబెట్టిన అంబలితాగి, మధ్యాహ్నానికి రెండు ఎరగడ్డలు, రెండు పచ్చిమిరపకాయలు, చద్దన్నం మూట, ప్లాస్టిక్‌ బిందెలో పదిలంగా పెట్టుకని బోడిగుట్టకు కోడు కొట్టుకుందుకు బయలుదేరుతారు. పనిలోకి వంగితే ఇద్దరి మధ్య మాటా […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు । తాటి తోపులో పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన తన నడుముకు కట్టమంటది మా వదిన ।వదినకు । చెరువులొ ఉండే కప్పల్ని చూసి బోండాలంటది మా వదిన తాను భోంచేస్తానంటది మా వదిన ।వదినకు । బండిని తోలే బండోణ్ని చూసి నా మొగుడంటది మా వదిన ఎగిరి బండెక్కి కూర్చుంటది […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఆ ఒక్క సీటూ మనోడిదే!

రాష్ట్రంలో ప్రభుత్వ బోధనా కళాశాలల్లో అన్నింటిలో కలిపి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటు ఒకే ఒక్కటి ఉంటుంది. 2013-14 విద్యాసంవత్సరానికి జరిగిన స్విమ్స్ సెట్‌లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఉన్న ఏకైక సీటును జిల్లా వాసి సొంతం చేసుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్‌స్పెషాలిటీ కోర్సులో డా.దినకర్‌రెడ్డి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటు సాధించారు. వైఎస్సార్ (కడప) జిల్లా పులివెందులకు చెందిన డా.దినకర్‌రెడ్డి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, పీజీ(జనరల్ సర్జరీ) చేశారు.పూర్తి వివరాలు ...

వార్తలు

ఈ రోజు నుంచి పంచాయతీ నామినేషన్ల స్వీకరణ

జిల్లా వ్యాప్తంగా 785 పంచాయతీలకు సంబంధించి ఏ పంచాయతీకి ఆ పంచాయతీ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అదేరోజు నుంచి 241 క్లస్టర్ల పరిధిలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మూడు దశల్లో జరిగే ఎన్నికలకు ఈనెల 9వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 13న, నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీఓలకు అప్పీళ్లు 15న, అప్పీళ్లకు ఆర్డీఓ పరిష్కారం […]పూర్తి వివరాలు ...