వార్తా విభాగం

రాజకీయాలు

ఆంటోనికి నోరు లేదు, దిగ్విజయ్‌ తెలియనోడు

వారు సీఎం కావాలనుకుంటే 20ఏళ్ళపాటో, అంతకుమించో సీఎంగా పెట్టుకోవచ్చు రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, ప్రాజెక్టు లు అన్నీ పూర్తిచేయాలని మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి కోరారు.రాష్ట్ర విభజనతో ఉడుకుతున్న సీమాంధ్రలో మంటలార్పే ప్రయత్నంతో కేంద్రం ప్రకటించిన కమిటీతో సీమాంధ్రకు అన్యా యం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కమిటీలో ఆంటోనికి నో రు లేదని, దిగ్విజయ్‌సింగ్ తెలిసినవాడు కాదన్నారు. శుక్రవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

అది సోనియాగాంధీ కుట్ర!

నెహ్రూ ప్రారంభించిన విశాలాంధ్రను ఇందిరాగాంధీ భావాలకు, రాజీవ్‌గాంధీ ఆశయాలకు విరుద్ధంగా సోనియాగాంధీ ఇపుడు ముక్కలు చేసేందుకు పూనుకుని సీమాంధ్రుల గొంతు కోసిందని కమలాపురం శాసనసభ్యుడు వీరశివారెడ్డి విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరులోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రులు, ఎంపీలే కారణమని ఆరోపించారు. వారే ఆంటోని కమిటీ ముందుకొచ్చి ఇబ్బందులను వివరించి విభజన ప్రక్రియను ఆపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన కోసం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరునెలల ముందు నుంచే కుట్ర […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం ప్రసిద్ధులు

పద్మనాభరెడ్డి ఎందుకు జడ్జి కాలేకపోయారు?

(18.05.1931 – 04.08.2013) న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి. న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపాడవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండలు ఇవ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. హైకోర్టు సీనియర్ న్యాయ వాది సి.పద్మనాభరెడ్డి మృతితో ప్రజా ఉద్యమాలకు అండదం డలందించే గొప్ప మానవతావా దిని […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

బేట్రాయి సామి దేవుడా! – జానపద గీతం

బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                       1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ            1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి కొండకింద దూరగానె సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్ల కిచ్చినోడ                  !బే1 అందగాడవవుదు లేవయా-గోపాల గో విందా రచ్చించ రావయా పందిలోన సేరి కోరపంటితో […]పూర్తి వివరాలు ...

వార్తలు

రాయలసీమ పరిరక్షణ సమితి ఆవిర్భావం

తిరుపతి : నాలుగు జిల్లాలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, ఇంజనీర్లు, విద్యార్థి నాయకులు, మేధావుల సమక్షంలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భవించింది.  రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.  తిరుపతి ఇందిరా మైదానంలో గురువారం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా బెరైడ్డి మాట్లాడుతూ ఎక్కడి నుంచో వచ్చిన తెల్లదొరసాని నలుగురు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

బట్టలు విప్పి కొడతారా!

విభజన జరిగితే ప్రత్యేక రాయలసీమ ప్రకటించాల్సిందే తెలంగాణలో కలిపేందుకు కర్నూలు జిల్లా ఎవరి అబ్బ సొత్తు అని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన కల్లూరులోని స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేందుకు డీల్లీ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసిందన్నారు. ఇలాంటి కోతి చేష్టలు ఇప్పటికైనా మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు బట్టలు విప్పి […]పూర్తి వివరాలు ...

గుసగుస ప్రత్యేక వార్తలు

రాయలసీమకు ఏం చేసింది?

నికర జలాలతో స్వాతంత్య్రం అనంతరం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు రెండు దశాబ్ధాలుగా గడిచినా పూర్తి కాని మిగులు జలాల ప్రాజెక్టులు పోతిరెడ్డి పాడును వ్యతిరేఖించిన కోస్తా, తెలంగాణ నాయకులు కోస్తాంధ్రకు పోలవరాన్ని ప్రకటించిన కేంద్రం మనకేమిచ్చింది? తెలంగాణ వారిలాగా మనం కూడా ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం మంచిది ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమఘట్టంలో వున్న రాయలసీమ వాసులకు ఇప్పుడు రాష్ట్రవిభజన మరింత ప్రమాదకరంగా మారిందని, రాష్ట్రం వీడిపోతే జలయుద్ధాలు తప్పవని రిటైర్డ్ చీఫ్ […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

ఎద్దుల ఈశ్వరరెడ్డి

ఎద్దుల ఈశ్వరరెడ్డి (1986 ఆగస్టు 3) అంతిమ శ్వాస విడిచి, 27 సం||లు అయ్యింది. 27వ వర్థంతి సందర్బంగా ఆయన గురించిన స్మృతులను నెమరు వేసుకోవడం, నేటి పరిస్థితులను మదింపు చేసుకోవడం అత్యంత అవసరం. ఈశ్వరరెడ్డిగారు నిజంగా కీర్తిశేషులే. ”గాడ్‌ ఈజ్‌ క్రియేటెడ్‌ బై మాన్‌” (దేవుడు మానవ సృష్టి) అన్న స్వామి వివేకానందుడు కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆధ్యాత్మిక సన్యాసి అయితే, ”కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు”. […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

ఇక సీమాంధ్ర కాంగ్రెస్ విన్యాసాలు

నెహ్రూ వారసులు మొదలెట్టిన ఆట చివరి అంకానికి చేరింది. రాష్ట్ర విభజన రెండుముక్కలాటే అని కాంగ్రెస్ అధినేత్రి ఏకపక్షంగా తేల్చేశారు. ఆ మధ్య ఒక వ్యాసంలో సీనియర్ పాత్రికేయులు ఎం.జె. అక్బర్ చెప్పినట్లు దేశం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నపుడు, ప్రభుత్వం విఫలమైనపుడు వాటి తాలూకు ప్రతిస్పందనలు, ఆందోళనలు జనబాహుళ్యం పైన ప్రభావం చూపుతున్నదని తెలిసిన మరుక్షణం, అదీ ఎన్నికలకు సిద్దమవుతున్న సందర్భంలో వాటిని పక్కదారి పట్టించడానికి మూలన పడిన నిర్ణయాలను, బిల్లులను ఏకబిగిన బయటకు తీసి విన్యాసం […]పూర్తి వివరాలు ...