రాజంపేట: జిల్లా ప్రజలు వైకాపాకు పట్టం కట్టారనే కక్షతో తెదేపా ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడంలేదని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాజంపేటలో విలేకరులతో మాట్లాడుతూ… వైఎస్ పాలనలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అయితే ఇప్పుడు ఏ రంగంలోనూ అభివృద్ధి మచ్చుకైనా కానరావడంలేదన్నారు. కనీసం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే వ్యాపారాలు పెరుగుతాయని, పరిశ్రమలు వస్తాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. ఈనెల 30న కడపలో నిర్వహించే వైకాపా జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో […]పూర్తి వివరాలు ...
కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందిన సందర్భంగా.. ప్రముఖ కథా రచయిత ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి తో కె.ఎస్.రమణ ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సంభాషణ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో డిసెంబర్ 23 ,1996న ప్రచురితమైంది. ఆ సంభాషణ కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం… నిన్న కా.రా. మాష్టారు, నేడు మీరు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందటం ఆధునిక తెలుగు సాహిత్యానికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది అనటానికి సూచనగా వుందని భావిస్తున్నారు. మీరేమంటారు? “మీరన్నది అక్షరాల నిజం. ఆధునిక […]పూర్తి వివరాలు ...
వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం) కదిరి చిన్నదానా కదిరేకు నడుముదానా నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సిల్కు సీరెకు రేణిగుంట్ల రేయికాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సైజు చేతులకు సైదాపురం గాజులకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| పులివెందుల పూలాకు నీ వాలు జడలాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| ముద్దనూరి ముద్దులకు నీ సన్న పెదవులకు ముద్దెట్ల […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రకటించి చివర్లో ఆ కార్యక్రమం వాయిదా పడినట్లు మీడియాకు లీకులిచ్చారు. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా అధికారులు ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు. ఎయిర్‌పోర్టులో రన్‌వే 8 సీటర్ విమానం దిగేందుకు అవసరమైన స్థాయిలోనే నిర్మించారని అందువల్లే విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడిందని ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వచ్చాయి. వెంటనే మంత్రి కిశోర్ బాబు మరో మూడు నెలలలో […]పూర్తి వివరాలు ...
తల్లిదండ్రులను అందరు పిల్లలు ప్రేమిస్తారు. గౌరవిస్తారు. కాని కన్నబిడ్డలచే ఆరాధించబడే తల్లిదండ్రులు కొద్దిమంది మాత్రమే! బిడ్డలచే ఆరాధించబడే తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక గుణాలు, సంస్కారం ఉండాలి. మహోన్నతమైన ప్రేమ, ఆదరణ, ప్రవర్తన ఉన్నటువంటి పూజ్యులు నా తల్లిదండ్రులు స్వర్గీయులు కడప కోటిరెడ్డి గారు, శ్రీమతి రామసుబ్బమ్మ గారు. నా తండ్రి శ్రీ కోటిరెడ్డి గారు మనోవాక్కాయ కర్మలతో ధర్మము తప్పక ప్రవర్తించారు. వారి ప్రవర్తన, ఆలోచనలు ఉత్తమోత్తంగా ఉండేవి. అతి సున్నితమైన మనస్సు, అబద్ధమాడకూడదు, ఇతరులను నొప్పించకూడదు […]పూర్తి వివరాలు ...
www.www.kadapa.info వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు! ఈ దీపావళి మీ జీవితంలో కొంగొత్త వెలుగులు నింపాలని www.www.kadapa.info మనసారా కాంక్షిస్తోంది! పటాకులు కాల్చేటప్పుడు, దీపాలు ముట్టిచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా పండగ చేసుకోండి!పూర్తి వివరాలు ...
వర్గం: చెక్కభజన పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏక తాళం) ఈ పొద్దు వానొచ్చె మలిపొద్దు సినుకోచ్చె కొండంత మబ్బొచ్చె కోరినా వానల్లు కురిపిచ్చి పోతావని ఆశలే సూపిచ్చివా – వరుణా అన్యాలమే సేచ్చివా ఏరులెండి పాయ సెరువులెండి పాయ దొరువులెండి పాయ సేల్లు బీల్లయిపాయ నీకు సేసిన పూజలన్ని భంగములాయ ఆశసంపి పొతివా – వరుణా అన్యాలమే సేచ్చివా గడ్డిపాసలు ల్యాక పసువులెండి పాయ తిననీకి తిండిల్యాక కండల్కరిగి పాయ గింజ గింటలు […]పూర్తి వివరాలు ...
అనుమానమే ఆ హత్యలకు మూలకారణం పోలీసు దర్యాప్తులో వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కడప నభీకోటలోని జియోన్ పాఠశాల ఆవరణలో ఈనెల 7న బయటపడిన కృపాకర్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు సంబంధించిన కేసులో నిందితులు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు వివరాలను బుధవారం కడప తాలుకా పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు వెల్లడించారు . పోలీసు దర్యాప్తులో వెల్లడైన కథ ఇదీ… ‘కృపాకర్ భార్య మౌనిక 2013 ఫిబ్రవరి 17న రూ.13 […]పూర్తి వివరాలు ...
వర్గం: ఇసుర్రాయి పాట పచ్చొడ్లు నే దంచి పాలెసరు బెట్టీ పాలేటి గడ్డనా మూడు నిమ్మల్లూ మూగ్గూ నిమ్మల కింద ముగ్గురన్నల్లూ ముగ్గూరన్నల కొగడు ముద్దు తమ్మూడు పెద్దవన్న నీ పేరు పెన్నోబలేసూ నడిపెన్న నీ పేరు నందగిరిస్వామీ సిన్నన్న నీ పేరు సిరివెంకటేసూ కడగొట్టు తమ్మూడ కదిరి నరసింహా ముగ్గురన్నలతోడ నాకి సరిబాలు సరిబాలు గాదమ్మ వొడిబాలు నీకు రత్నాలు ముత్యాలు చాటాకు బోసి వొడి నించ వచ్చెనే తల్లి బూదేవి రత్నాలు నాకొల్ల ముత్యాలు […]పూర్తి వివరాలు ...