వార్తా విభాగం

అభిప్రాయం చరిత్ర

శ్రీభాగ్ ఒప్పందం లేదా ఒడంబడిక

శ్రీభాగ్ ఒప్పందం నేపధ్యం మరియు అందులోని అంశాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది. ఇందుకు ఒక ఉదాహరణ  1927లో జనమంచి శేషేంద్ర శర్మ గారు రాసిన ‘కడప మండల చరిత్రము’ అనే పుస్తకములో కూడా చూడవచ్చు. పాపం శర్మ గారు కడప జిల్లాలో […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

‘రాయలసీమవారి అభిప్రాయానికి ఇప్పటికైనా కట్టుబడాలి’ – ఎబికె ప్రసాద్

స్వార్థ ప్రయోజనాలతో, అధికార దాహంతో తెలుగుజాతిని చీల్చిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు రాజధాని కోసం ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలి కోట్లకు పడగలెత్తిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులకూ, వారి ప్రయోజనాలను కాపాడే అవినీతి రాజకీయ బేహారుల కోసం గాలింపులు సాగిస్తున్నారు. అశాతవాహన, కాకతీయ, రాయల విజయనగర యుగాలు తెలుగుజాతి సమైక్యతకూ, శతాబ్దాల తరబడి భాషా, సాంస్కృతిక వైభవ ప్రాభవాలకూ మూలవిరాట్టులుగా, కొండగుర్తులుగా నిలిచాయి. ఆనాటి సామంతరాజులైన మండల పాలకుల స్థానిక […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆదేశం

హైకోర్టు ఆదేశాలతో జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్ళీ ఉత్సుకతను పెంచేలా ఉంది. ఈ నెల 4న జరిగిన ఓటింగ్ కు ఇష్టపూర్వకంగానే గైర్హాజరైన జానీ ఓటును పరిగణలోకి తీసుకోరాదని ఆదివారం (13వ తేదీన) చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తూనే , ఎన్నికల వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా కోరం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేసిన ఆర్డీఓపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై […]పూర్తి వివరాలు ...

చరిత్ర

కడప జిల్లా శాసనాలు 3

భారతదేశంలోనే ఏకైక శాసనం… నీటి పారుదల సౌకర్యాలను గురించి తెలుపుతున్న శాసనాల్లో కూడా కడప జిల్లాకు ప్రత్యేక స్థానముంది. బుక్కరాయల కుమారుడు, ఉదయగిరి రాజ్యపాలకుడు భవదూరమహీపతి (భాస్కరరాయలు) క్రీ.శ. 1369లో పోరుమామిళ్లలో అనంతరాజసాగరమనే తటాకాన్ని నిర్మించి ఆ సందర్భంలో ఒక శాసనాన్ని వేయించాడు. చెరువుకట్ట మీద రెండు బండలపై చెక్కబడి ఉన్న ఈ శాసనం మధ్యయుగాల్లోని తటాక నిర్మాణ కౌశలానికి ప్రబల సాక్ష్యంగా దర్శనమిస్తుంది. తటాక నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఔను..వీళ్ళు కూడా అంతే!

కడప జిల్లా అంటే అదేదో వినకూడని పేరైనట్లు ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తుంటే తాజాగా రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తానేమీ తక్కువ తినలేదని నిరూపించింది.రాయలసీమలోని మూడు జిల్లాలను పరిశీలించిన సదరు కమిటీ సభ్యులు ఒక్క కడప జిల్లాను మాత్రం విస్మరించారు. ఎంచేత? ప్రభుత్వ పెద్దలూ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులూ అంతా కమిటీతో సంబంధం లేకుండా తమ సామాజికవర్గం, ధనికుల ప్రాబల్యం అధికంగా ఉండే గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించేశారు. […]పూర్తి వివరాలు ...

వార్తలు

కదంతొక్కిన విద్యార్థులు

సీమలో రాజధాని ఏర్పాటు చేయకుంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని విద్యార్థులు హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సంఘం కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ రాజధాని రాయలసీమ హక్కు అనే విషయాన్ని మన పాలకులు మరచిపోతున్నారన్నారు. సీమలో రాజధాని ఏర్పాటు కోసం కృషి చేయని రాజకీయ నాయకులను తరిమికొట్టాలన్నారు. […]పూర్తి వివరాలు ...

కవితలు

తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక!

ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా పొగబండీ..ల్యాకపాయ ఒరే సంటోడా..ఒరే సన్నొడా ఎర్ర బస్సూ కరువైపాయ అబ్బ పాలెమాలినా.. జేజికి బాగ లేకపొయినా గుంతల దోవలే దిక్కైపాయ తాతల కాలం నుంచీ పొగబండ్లని ఇనడమేకానీ ఎక్కిన పాపాన పోల్యా ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ కాలు మింద కాలేసుకోని కూచ్చోని రోంత దూరమన్నా పోయింది ల్యాకపాయ మా సిన్నాయన ఒకసారి కనకదుర్గమ్మ తిన్నాలకు పోయుండ్య పొగబండ్లతోనే పైన మోడాలు ఆడ్తాండయంట ఊరూరికీ పొగబండ్లలోనే జనాలంతా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

మా రాయలసీమ ముద్దు బిడ్డడు

మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాలు సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు నేడు వైఎస్ జయంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం

కడప జిల్లా పరిషత్‌ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్‌ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. […]పూర్తి వివరాలు ...

error: