కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ జిల్లాకు రావడం ఇదే ప్రథమం. అందుకు సంబంధించి బాబు తన పర్యటనలో అధికారికంగా పలు కార్యక్రమాలకు బాబు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటన సాగేదిలా…. చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి బయలుదేరి 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 12.00 గంటలకు కోడూరు సమీపంలోని ఓబనపల్లెకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యకక్రమాల్లో పాల్గొంటారు. […]పూర్తి వివరాలు ...
సిద్దవటం ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పి.శైలజ, జగదీశ్వర్‌రెడ్డి జాతీయ స్థాయి అండర్-16 నెట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు రవిబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు రెడ్డెయ్య తెలిపారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు బాలికల విభాగంలో శైలజ, బాలుర విభాగంలో జగదీశ్వర్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. నవంబర్ 1 న విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-16 నెట్‌బాల్ పోటీలో వీరు ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు అర్హత సాధించారన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: 2014 -15 విద్యా సంవత్సరం కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులు ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ జూనియరు డిగ్రీ కళాశాలలు, వృత్తివిద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తునకు అర్హులన్నారు. అర్హులైన విద్యార్థులు https://apepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషను చేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2లక్షల లోపున్న […]పూర్తి వివరాలు ...
కడప: ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు తహసీల్ధార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశాయి. ఈ ధర్నాల్లో వైకాపాకు చెందిన నేతలు, శాసనసభ్యులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీ ఇచ్చిన విధంగా తక్షణమే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వోలకు వినతిపత్రాలను సమర్పించారు. పులివెందులలో మాజీ మంత్రీ వివేకానందరెడ్డి, వేముల, వేంపల్లెలలో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరులో […]పూర్తి వివరాలు ...
కడప: పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతిగృహాల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్ అన్నారు. మూసివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని.. లేదంటే మంత్రి రావెల కిశోర్‌బాబు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మంగళవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ విగ్రహం నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ మంత్రి రావెల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళుతున్నారని, ఇందులో భాగంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రొద్దుటూరులో పోటీ చేస్తారని, ఇందుకుగాను రూ.36కోట్లకు ఒప్పందం కుదిరిందని, టీ దుకాణాల వద్ద తెదేపా నేతలు ప్రచారం చేయిస్తున్నారన్నారని వైకపా శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాదరెడ్డి వాపోయారు. ఇందుకు కొనసాగింపుగానే ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఇదే మాదిరిగా జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గాలలో ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. అలాగే తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నట్లు […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలోని పాతబస్టాండ్ నుంచి రిమ్స్ ఆసుపత్రికి రోజుకు ఎనిమిది సార్లు తిరిగేలా సోమవారం నుంచి ఆర్టీసి బస్సు సర్వీసు ప్రారంభమైంది. నగర శివారులో ఉన్న రిమ్స్ ఆసుపత్రికి కొన్నాళ్లుగా బస్సు సౌకర్యంలేదు. దీంతో రోగులు, వారి సహాయకులు, ఉద్యోగులు ఆటోలను ఆశ్రయించేవారు. ఉదయం 8.45 గంటలకు పాత బస్టాండ్‌లో మొదలయ్యే ఈ బస్సు.. ఏడురోడ్లు, పాతరిమ్స్, కోటిరెడ్డి కూడలి, ఎర్రముక్కపల్లె, కలెక్టర్ బంగళా, శిల్పారామం మీదుగా రిమ్స్‌కు చేరుకుంటుంది. పాత బస్టాండు నుండి రిమ్స్ కు ప్రయాణ […]పూర్తి వివరాలు ...
కడప: స్థానిక సీపీ బ్రౌన్ బాషా పరిశోధన కేంద్రం వేదికగా ఆదివారం మల్లెమాల సాహిత్య పురస్కార ప్రధానోత్సవం, పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. సాహితీ రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా ఆచార్య మధురాంతకం నరేంద్ర మల్లెమాల సాహితీ పురస్కారం అందుకున్నారు. ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమమంలో సామాజిక ప్రయోజనంగా మధురాంతకం నరేంద్ర సాహిత్యం ఉంటుందని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ… మనుషు ల వ్యక్తిత్వంలో ఉన్న తేడాను […]పూర్తి వివరాలు ...
రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. పాటలో వేగం పెరిగే కొద్దీ అడుగులు వేగంగా కదుల్తాయి. ఇటీవలి కాలంలో […]పూర్తి వివరాలు ...