వార్తా విభాగం

ఆచార వ్యవహారాలు

రేపటి నుంచి పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు

చిన్నర్సుపల్లెలో సద్గురు పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు ఈనెల 15 నుంచి నిర్వహిస్తున్నట్టు పీఠాధిపతి నాగలింగమయ్య తెలిపారు. మకర సంక్రాంతి నాడు ఉదయం నుంచే స్వామివారి జీవసమాధికి పుష్పాలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పగలంతా ప్రత్యేక కార్యక్రమాలుంటాయని, రాత్రికి స్వామివారి పేరుతో కాలమానిని ఆవిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కొండమూల చౌడేశ్వరీమాత వూరేగింపు, పెద్దమండెం మండలం నుంచి వచ్చే దేవరెద్దు ప్రదర్శనతో పాటు చింతామణి, సత్యహరిశ్చంద్ర నాటకాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. 16న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జెండా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం

ఫిబ్రవరి 22న రెండో విడత 3054 పోలియో బూత్‌ల ఏర్పాటు కడప: దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈనెల 18వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ కెవి రమణ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో 3లక్షల 17వేల 452 మంది 0నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప జిల్లాకు అన్యాయం చేస్తున్నారు

కడప: జిల్లాలో వైకాపాకి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కడప జిల్లాకు పూర్తి అన్యాయం చేస్తున్నారని వైకాపా జిల్లా కన్వీనర్‌ అమరనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాష, నగర మేయర్‌ సురేష్‌బాబులు ధ్వజమెత్తారు.  వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కడప విమానాశ్రయం పూర్తయి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంత వరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు.  వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే!

పల్లెలో పండుగ సందడి కన్పించటం లేదు. టౌన్నించి ఆటో దిగే వాళ్ల చేతుల్లో సగం సంచినిండా కూడా పండుగ సరకులు లేవు. సంవత్సరానికంతా ఇదే పెద్ద పండుగ గదా! ఆ కొద్ది దినుసులతో మూడురోజుల పండుగను ఎలా యీదగలరో మరి! ఇంటి ముందు పేడనీళ్లు – ఇంట్లో చారు నీళ్లతోనే పండుగ జరిగిపోయేట్టుంది. బెల్లంకూడూ నేతిబొట్టు అనుపాకం కుదరకుండానే, అలసంద వడలు సియ్యల పులుసు తోడు లేకుండానే, అప్పచ్చులు కారేల వియ్యమందకుండానే పండుగ దాటిపోయేట్టుంది మా పల్లె […]పూర్తి వివరాలు ...

శాసనాలు

ఎర్రగుడిపాడు శాసనము

ఎర్రగుడిపాడు కమలాపురం తాలూకాలోని ఒక గ్రామము. ఈ శాసనం క్రీ.శ. 575 నాటికి చెందినది కావచ్చు. మొదటివైపు 1. స్వస్తిశ్రీ ఎరిక 2. ల్ముత్తురాజుల్ల 3. కుణ్డికాళ్లు నివబుకా 4. ను ఇచ్చిన పన్నన 5. దుజయ రాజుల 6. ముత్తురాజులు నవ 7. ప్రియ ముత్తురాజులు 8. వల్లవ దుకరజులు ళక్షి 9. కాను ఇచ్చి పన్నస్స రెండవైపు 10. కొట్టంబున పా 11. పాఱకు కుణ్డికాళ్లు 12. ళా ఇచ్చిన పన్నస 13. ఇరవది […]పూర్తి వివరాలు ...

కథలు

సియ్యల పండగ (కథ) – తవ్వా ఓబుల్‌‌రెడ్డి

”మా ఉళ్ళో ఏ పండగ వచ్చినా, ఏ సంబరం జరిగినా, గవినికాడి పుల్లయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు ! సిన్నప్పటి నుంచీ పుల్లయ్య యవ్వారమే అంత అని మా నాయన చెబుతా ఉంటాడు. సంకురాత్రి పండగయితే పుల్లయ్యను పట్టుకోడానికి పగ్గాలుండవ్‌! ఊళ్ళో ఇళ్ళిళ్ళూ తిరుగుతా ఉంటాడు. ఏ ఇంట్లో ఏ వంటలు సేచ్చాండారు? ఏఏ ఊర్లనుండీ చుట్టాలు వచ్చినారు? ఊళ్ళో దేవుని మేరవని  ఎట్ల జేచ్చే బాగుంటది? పార్యాట ఆపొద్దు  ఏ జామున యాటపొట్టేళ్ళు, […]పూర్తి వివరాలు ...

శాసనాలు

తిప్పలూరు శాసనము

తిప్పలూరు శాసనము ఇదియు కమలాపురం తాలూకాలోనిదే. దీని లిపి సొగసైన పల్లవ-గ్రంథాక్షరములను పోలి యుండును. ణకారము కళింగరాజుల శాసనములందువలె నుండును. ఎరికల్ ముతురాజు పుణ్యకుమారుడు చివన్‌లి పట్టుగాను రేనాణ్డేలుచుండగా చామణకాలు అను ఉద్యోగిక ఱెవురు(నివాసియగు) తక్కన్ ప్రోలు పారదాయ (భారద్వాజః)కత్తిశర్మకు తిప೯ లూరను ఏబది (మతరుల) పన్నస కాత్తి೯క మాసము బహుళపక్షము ద్వతీయ,పుణరు పుష్యమి (పునర్వసు) నక్షత్రము సోమవారము బృహస్పతిహోర అగు సమయమున ధర్మము చేసెను. పుణ్యకుమారునికి మరున్థ(ఇక్కడ థవత్తును θగా చదవాలి) పిడుగు; మదుముదితున్ఠు (ఇక్కడ […]పూర్తి వివరాలు ...

చరిత్ర

రేనాటి చోళుల పాలన

రేనాటి చోళుల పాలన – ఇతర విశేషములు రేనాటి చోళులు మొదట పల్లవుల తరువాత బాదామి చాళుక్యుల సామంతులుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయినప్పటికి పల్లవ మహేంద్రవర్మ కాలమునందు పుణ్య కుమారుడు స్వతంత్ర ప్రతిప్రత్తితో రేనాటి రాజ్యమును పాలించినట్లు అతడు వేయించిన తామ్ర శాసనములు, రామేశ్వరం శిలాశాసనం సూచిస్తున్నవి. రేనాటి చోళరాజులు తమను ప్రాచీన చోళరాజు కరికాలునికి చెందినవారుగా చెప్పుకొనుటవలన, కొందరి రాజుల పేర్లు చోళ మహారాజులని ఉండుట చేతను, వీరు కావేరి తీరమున గల ఆది చోళ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

చుక్క నీరైనా ఇవ్వని సాగర్ కోసం ఉద్యమించేట్టు చేశారు

తెలుగువారందరి ప్రత్యేక రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించి రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపో యారు. సర్కారు జిల్లాలతో ఐక్యత పట్ల నాటి సీమ నేతలలో పలువురికి ఆంధ్ర మహాసభ కాలం నుండి అనుమానాలు ఉండేవి. ఆంధ్ర విశ్వవిద్యా లయ కేంద్రాన్ని అనంతపురం లో ఏర్పాటు చేయాలంటూ యూనివర్సిటీ సెనేట్ కమిటీ 1926లో చేసిన తీర్మానాన్ని సైతం లెక్కచేయక దాన్ని విజయవాడ నుండి విశాఖపట్టణానికి తరలించారు. ఇలాంటి వైఖరి కారణంగానే తమిళుల ఆధిపత్యం వదు ల్చుకొని సర్కారు […]పూర్తి వివరాలు ...

error: