పల్లెలను వదలని పాడు జరాలు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు రాజధాని ‘శ్రద్ధ’ ప్రజారోగ్యం పై ఏదీ? కరువు దరువుకు తోడు ప్రభుత్వ ఆదరువు లేక అల్లాడుతున్న మన పల్లెలపైన పాడు జరాలు పగబట్టినాయి. కడప జిల్లాలోని పలు పల్లెలు పాడు జరాల బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50కి పైగా ప్రాణాలు జ్వరాల కారణంగా గాల్లో కలిసిపోయినట్లు అనధికార సమాచారం. […]పూర్తి వివరాలు ...
పౌరుషాల గడ్డన పుట్టి పడిఉండటం పరమ తప్పవుతుందేమో కాని ..! కుందేళ్ళు కుక్కలను తరిమిన సీమలో ఉండేలులై విరుచుకపడటం తప్పే కాదు ఉరి కొయ్యలూ ..కారాగారాలూ ఈ సీమ పుత్రులకు కొత్త కాదు తిరుగుబాటు చేయడం ..ప్రశ్నించడం ఇక్కడి వీరపుత్రులకు ..బ్రహ్మ విద్య కాదు ఈభూమి చరిత్ర పుటల్ని తిరగేసి చూడు మడమ తిప్పనితనం ఇక్కడి రక్తంలో నిక్షిప్తం ఉయ్యాలవాడ ఉగ్గుపాలతో నేర్పిన నైజం హంపన్న అహం హుంకరించిన చారిత్రక నిజం పప్పూరి ..కల్లూరి..గాడిచర్ల ఈ సీమ […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రిగారూ! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి రమ్మంటూ నాకు ఆహ్వాన పత్రిక పంపారు. రాయలసీమ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘నేను రాలేను’ అని చెప్పడానికి చింతిస్తున్నాను. సీమ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో మీరు చేసిన ప్రకటనలు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మీరు వ్యవహరిస్తున్న తీరు పొంతన లేకుండా ఉన్నాయి. అభివృద్ధిలో తీవ్రమైన అసమానతల వల్లే తొలి భాషా ప్రయుక్త […]పూర్తి వివరాలు ...
సంకీర్తన:296 ‘రామభద్ర రఘువీర’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో॥పల్లవి॥ కౌసల్యానందవర్ధన ఘనదశరథసుత భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ రాసికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా॥రామభద్ర॥ మారీచసుబాహు మర్దన తాటకాంతక దారుణవీరశేఖర ధర్మపాలక కారుణ్య రత్నాకర కాకాసుర వరద సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా ॥రామభద్ర॥ సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుటయోధ్యాపుర నిలయా యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన […]పూర్తి వివరాలు ...
కడప: కడప బెంగుళూరు నగరాల మధ్య నడుస్తున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసులు గత కొద్ది రోజులుగా నడవటం లేదు. ఈ రెండు నగరాల మధ్య వారానికి మూడు సార్లు ఎయిర్ పెగాసస్ ఎటిఆర్ 72 రకం విమానాల్ని నడుపుతోంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే విమాన ప్రయాణీకుల సంఖ్య కూడా బాగానే ఉంది. అయితే ఉన్నట్టుండి అక్టోబర్ 1 నుండి విమాన సర్వీసును నిలిపివేసిన ఎయిర్ పెగాసస్ టికెట్ల విక్రయాన్ని కూడా ఆపింది. దీంతో కడప బెంగుళూరుల […]పూర్తి వివరాలు ...
తరలివచ్చిన ఐటి నిపుణులు, విద్యార్థులు ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ది సాధ్యమన్న వక్తలు (బెంగుళూరు నుండి అశోక్ అందించిన కథనం) తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని రాయలసీమ కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ బెంగళూరు సంఘం ఆధ్వర్యంలో శనివారం (ఈ రోజు) బెంగుళూరు నగరంలోని కుందనహళ్లిలో రాయలసీమ అభివృద్ది పైన నిర్వహించిన చైతన్య సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి శ్రీ పద్మావతి […]పూర్తి వివరాలు ...
తితిదే అధికారుల నిర్వాకమే కారణం పులివెందుల: మండలంలో ఉన్న గండిదేవస్థానం ఎట్టకేలకు తితిదే నుంచి విముక్తమై దేవాదాయశాఖలోకి విలీనమైంది. శనివారం తితిదే అధికారులు స్థానిక నాయకుల సమక్షంలో దేవాదాశాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్టెం గురుప్రసాద్‌కు రికార్డులు అందజేశారు. నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో 2007లో దేవాదాయ శాఖలో ఉన్న గండిక్షేత్రాన్ని తితిదేలోకి విలీనం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో ఆలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ చూపిన తితిదే అధికారులు 2009 […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: పుస్తకాలు మానవాళికి మార్గదర్శకం అని జిల్లా గ్రంధాలయ పాలక మండలి సభ్యులు జింకా సుబ్రహ్మణ్యం అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. జవివే పట్టణ ప్రధాన కార్యదర్శి కే.వి.రమణ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన లభించిందని ఆన్నారు. సైన్సు, కథలు , విశ్వదర్శనం, ప్రయోగదీపికలకు మంచి స్పందన లభించిందని అన్నారు, పుస్తక ప్రదర్శన లో ci సత్యనారాయణ, si మహేష్, న్యాయవాది ముదివేముల కొండా రెడ్డి, సీనియర్ […]పూర్తి వివరాలు ...
నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం నుండి నీటిని తరలిస్తున్నారు చరిత్రలో ఈ మాదిరిగా శ్రీశైలం నుండి నీళ్ళు తీసుకుపోయిన దాఖలా లేదు రాయలసీమకు నీళ్ళు అందకుండా చేసే ఎత్తుగడ మీడియా సమావేశంలో రాయలసీమ అభివృద్ది సమితి (హైదరాబాదు నుండి మా విశేష ప్రతినిధి) శ్రీశైలం జలాశయం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తూ రాయలసీమకు నీళ్ళు అందకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎత్తుగడ వేశాయని రాయలసీమ అభివృద్ది సమితి ఆరోపించింది. దీని వల్ల సీమ రైతులకు తీవ్ర […]పూర్తి వివరాలు ...