వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి వైకాపా అధినేతకు ఆయన రాసినట్లుగా చెబుతున్న నాలుగు పేజీల లేఖ బుధవారం మీడియాకు విడుదలైంది. మైసూరారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

జగన్ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైసూరా లేఖలో తెలిపారు. వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని లేఖలో మైసూరా ఆరోపించారు. గతంలో తన ప్రమేయం లేకుండానే వైకాపాలో చేరాల్సి వచ్చిందని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా రాయలసీమ మహా ఫోరం ఏర్పాటుకు వైకాపా సానుకూలత వ్యక్తం చేయలేదని ఆరోపించారు.

చదవండి :  కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం

పలువురు శాసనసభ్యులు వైకాపాను వీడుతున్న సందర్భంలోనే మైసూరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తెదేపా వ్యూహంలో భాగమని ఆయన త్వరలోనే తెదేపా తీర్థం పుచ్చుకుంటారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: