రిమ్స్‌లో 10 పడకలతో కార్డియాలజీ విభాగం…త్వరలో

రాజీవ్‌గాంధి వైద్య విద్య, విజ్ఞాన సంస్థ – కడప

రిమ్స్‌లో 10 పడకలతో కార్డియాలజీ విభాగం…త్వరలో

కడప: రాజీవ్ గాంధీ వైద్య విద్యాలయం(రిమ్స్)లో త్వరలో 10 పడకలతో కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ అరుణకుమారి తెలిపారు.శుక్రవారం రిమ్స్ సంచాలకుని కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడిన ఆమె ఈ మేరకు వెల్లడించారు.అలాగే చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి మరో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.

అరుణకుమారి శుక్రవారం రిమ్స్‌లోని పలు వార్డులను పరిశీలించారు. అనంతరం ఓపీ విభాగానికి వచ్చి అక్కడ మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలలో తన రక్త నమూనాలను పరీక్షల కోసం ఇచ్చి ఎలా పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు.

చదవండి :  కడపజిల్లా పోలింగ్ విశేషాలు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: