మల్లూరమ్మ జాతర వైభవం

మల్లూరమ్మ జాతర వైభవం

ఆదివారం మధ్యాహ్నం సిద్దల బోనాలు పట్టడంతో ప్రారంభమైన మల్లూరమ్మ జాతర సోమవారం పగలు కనుల పండువగా సాగింది.  రాత్రికి మొక్కుబడిదారులు ఏర్పాటు చేసిన 17 చాందినీ బండ్లు సోమవారం తెల్లవారుజాముకు జాతరకు చేరుకున్నాయి.

బండ్ల ముందు ట్రాక్టర్లలో వీధి నాటకాలు, చెక్కభజనలు, కోలాటాలు చేశారు. ఇవి భక్తులను అలరించాయి. వేల సంఖ్యలో ప్రజలు రావడంతో గుడి దగ్గర రద్దీగా మారింది. ఒక్కో బండికి ఒక చుట్టే తిరగాలని పోలీసులు చెప్పడంతో ప్రశాంతంగా ప్రదక్షిణలు సాగాయి. సోమవారం పగలు తిరునాళ్ల సాగింది.

చదవండి :  మంగళవారం నుంచి మంచాలమ్మ జాతర

రాయచోటి సీఐ రాజేంద్రప్రసాద్, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లె, సంబేపల్లె ఎస్సైలుతో పాటు మరో 40 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: