9న ప్రొద్దుటూరుకు రానున్న ముఖ్యమంత్రి

ప్రొద్దుటూరు: ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రొద్దుటూరుకు రానున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ బుధవారం సాయంత్రం స్థానిక అధికారులతో కలిసి హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. మొదట గోపవరం గ్రామ పంచాయతీలోని కొర్రపాడు రోడ్డు రింగ్ రోడ్డు వద్ద ఉన్న అపెరల్ పార్కు దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాన్ని, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు.

9న ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మనువడు వివాహానికి రానున్నారన్నారు. అలాగే కడపలో జరిగే మరో వివాహానికి కూడా కిరణ్ హాజరవుతారు.

చదవండి :  కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆగింది ఇందుకా?

కలెక్టర్ వెంట మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, రాజుపాళెం మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి, తహశీల్దారు శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరావు, సీఐలు జనార్దన్‌నాయుడు, యుగంధర్, ఓబులేసు తదితరులు ఉన్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: