25న ప్రచారానికి చంద్రబాబు

    Chandra Babu Naiduకడప :  ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నిమిత్తం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు ఈ నెల 25న కడప జిల్లాకు రానున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మొదటి విడత పర్యటన, అలాగే మే నెల 1 నుండి నాల్గో తేదీ వరకు రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను ఏడు రోజుల పర్యటనకు ప్రణాళిక రూపొందించారు.
    కడప పర్యటనకు ఈ నెల 21నే బయలుదేరి రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల 25కు వాయిదావేసుకున్నారు. కాగా ఇప్పటికే పార్టీ సీనియర్‌నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, నామా నాగేశ్వరరావు, గుండు సుధారాణి, ఎల్‌. రమణ, వర్ల రామయ్య, తీగల కృష్ణారెడ్డి, తెలుగుమహిళ నేతలు శోభాహైమవతి, షకీలారెడ్డి, విజయారెడ్డి, అంజలిగౌడ్‌, దీపమల్లేష్‌, కుసుమ, సుప్రియ, దుర్గా, విజయలక్ష్మీలు కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల పరిధిల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. హనుమజ్జయంతి మంచి రోజు కావడంతో సోమవారం నాడే టిడిపి అభ్యర్థులు ఎంవీ. మైసూరారెడ్డి, బిటెక్‌ రవీలు నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక ఆ పార్టీకి ప్రచారమే తరువాయిగా మారింది.

    చదవండి :  జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి?

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *