15, 16న నామినేషన్ వేయనున్న జగన్, విజయలక్ష్మి

కడప: యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయలక్ష్మి ఈ నెల 16న నామినేషన్ వేయనున్నారు. కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి పులివెందుల శాసనసభ స్థానానికి, వారి కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కడప లోక్‌సభ స్థానానికి గత నవంబర్‌లో రాజీనామా చేయటంతో ఆ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే.

చదవండి :  రేపు కడపలో సీమ కథల పుస్తకాల ఆవిష్కరణ

కాంగ్రెస్ అధిష్టానం తమ కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర పన్నినందుకు నిరసనగా.. వారిద్దరూ ఆ పార్టీని వీడుతూ ఆ రెండు స్థానాలకూ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *