మాడుపూరు చెన్నకేశవ స్వామిపై అన్నమయ్య సంకీర్తన

ఈ ఊరు కడప జిల్లా సిద్దవటం తాలూకాలో లో వుంది. అన్నమయ్య మేనమామ గారి ఊరు మాడుపూరు.ఇక్కడి స్వామి చెన్న కేశవ స్వామి. అన్నమయ్య సంకీర్తనలపై పరిశోధన చేసిన శ్రీ మల్లెల శ్రీహరి గారు మాడుపూరు చేన్నకేశవునిపై ఇదొక్క సంకీర్తన మాత్రమె అందుబాటులో ఉన్నట్లు తేల్చారు.

చేరి యందెలమోతతో చెన్నకేశవా
యీ రీతి మాడుపూరిలో నిట్లాడేవా

మున్ను యశోదవద్దను ముద్దు గుని శాడితివి
పన్ని రేపల్లెవీధుల బారాడితివి
పిన్నవై గోపాలులతో బిల్లదీపులాడితివి
యెన్నిక మాడుపూరిలో యిట్లాడేవా

గాళింగుపడిగెలపై కడునాట్యమాడితివి
కేలి యమునలో రాసక్రీడ లాడితి
చేలలంటి గోపికల చెట్టాపట్టాలాడితివి
యీ లీల మాడుపూరిలో యిట్లాడేవా

తగువిభాండకునితో దాగిలి ముచ్చలాడితి
అగడుగా బండివిరిచాటలాడితి
వొగి శ్రీ వేంకటగిరినుండి వచ్చి మాడుపూర
నెగసెగసి గతుల కిటులాడేవా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: