వెంకటేశ్వరస్వామికి ఆస్తులు రాసివ్వాలి

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు లక్షల మెజార్టీ వస్తే తమ ఆస్తులు రాసిస్తామని చెప్పిన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి సవాలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెసేకు ఓటమి తధ్యం అని ప్రచారం ఊపందుకున్న ప్రస్తుత సమయంలో…ఆ సవాలుకు డీఎల్, వీరశివా కట్టుబడి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు.

 

వారు ఉప్పూ, కారం తిని ఉంటే, చీము నెత్తురు, కడప పౌరుషం ఉంటే ఆస్తులు రాసిస్తామనే మాటకు కట్టుబడి ఉండాలన్నారు. వారిద్దరూ అనేక అక్రమ దారుల్లో ఆస్తులు సంపాదించుకున్నారని, అదంతా పాపపు సొమ్మన్నారు. దాన్ని భరించడం ఎవరివల్లా కాదని, తిరువుల వెంకన్నకే అది సాధ్యమని చమత్కరించారు.

చదవండి :  సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు

 

Raghurami Reddyప్రజాస్వామ్యంపై నమ్ముకముంటే రెండు లక్షల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిన వెంటనే వెంకటేశ్వరస్వామికి ఆస్తులు రాసిచ్చి శేష జీవితం అక్కడే గడపాలని సూచించారు. మైదుకూరులో ప్రజలు డీఎల్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆయన తన మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ఓడిపోతే ఇక్కడికి ప్రచారం కోసం వచ్చిన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

చదవండి :  విశిష్టమైన అటవీ సంపద ''రాయలసీమ'' కే సొంతం!

అయితే జగన్ తన సవాలుకు స్పందించనందున దానికి కట్టుబడే అవకాశం లేదని చెప్పే ప్రయత్నం వీరశివా ఇప్పటికే చేశారు. మరి ఈ విషయంపై మంత్రి డి.ఎల్ ఎలా స్పందిస్తారో?

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: