రెచ్చగొట్టిన బాబుపై చెప్పులు, రాళ్లు, బురద

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పులివెందుల పర్యటనలో జనాన్ని రెచ్చగొట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ జగన్‌రెడ్డికి ఈ గ్రామంలో బాగా పట్టుంది.

చంద్రబాబునాయుడు ముందుగా లింగాల మండలంలోని పార్నపల్లెకు చేరుకొని కార్యకర్తలు, ప్రజలనుద్ధే శించి ప్రసంగించారు. అనంతరం కోమన్నూతల గ్రామానికి చేరుకొని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అవినీతిపై మాట్లాడుతుండగా వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బాబు ప్రసంగానికి అడ్డుతగలడం, తెలుగు దేశం, వై.ఎస్‌.ఆర్‌ కార్యకర్తల మద్య మాటల యుద్దం, చంద్రబాబు వాడివాడి వాగ్దానాలు సందించడం తో రెచ్చిపోయిన వై.ఎస్‌.ఆర్‌ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు, బురద మట్టితో దాడి చేశారు. ఇందుకు ప్రతీకగా తెదేపా కార్యకర్తలు కూడా వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై బాటిళ్లు విసరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చదవండి :  ఓట్ల బడికి రెండు రోజుల సెలవులు

సమస్య సద్దుమణుగుతుందన్న తరుణంలో.. అసెంబ్లీ అభ్యర్థి బీటెక్ రవి మీసాలు దువ్వుతూ గ్రామస్తులను తీవ్ర పదజాలంతో దూషించి తేల్చుకుందాం రమ్మని సవాలు విసిరారు

ఈ రాళ్లదాడిలో ఒక గన్‌మెన్‌కు, ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు వారిని చెదరకొట్టేందుకు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాబు కాన్వాయ్‌పై దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని లింగాల పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈ దాడిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు, అభ్యర్థులైన మైసూరారెడ్డి, బిటెక్‌ రవి, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, వారి గన్‌మెన్‌లకు, పోలీసులపైన బురద చల్లారు. గొడవ చేసిన వారి మీద చర్యలు తీసుకునే వరకు తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చంద్రబాబు తన వాహనం మీదే బైఠాయించారు. ఆయన ఆదేశం మేరకు పార్టీ నాయకులు కూడా రోడ్డు మీద కూర్చున్నారు.

చదవండి :  వివిధ రకాలైన నేరాల సంఖ్య ఎక్కడ ఎక్కువ?

టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో నుంచి రాళ్లు విసురుతుంటే.. వారిని ఏమాత్రం పట్టించుకోని పోలీసులు.. గ్రామస్తులపై మాత్రం లాఠీ చార్జి చేసి దొరికిన వారిని దొరికినట్లు చావబాదారు. ఒక ఎస్‌ఐ అయితే గ్రామస్తుల మీదకు రివాల్వర్ ఎక్కుపెట్టి కాల్చేస్తానంటూ ఊగిపోయారు.

ఇదీ చదవండి!

నీటిమూటలేనా?

కడప జిల్లాకు చంద్రబాబు హామీలు

వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు… తేదీ: 30 అక్టోబర్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో …

ఒక వ్యాఖ్య

  1. కేక పుట్టించిన కోమన్నూతల…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: