పాఠశాల ఆవరణలో 5 మృతదేహాలు

పాఠశాల ఆవరణలో మృతదేహాల్ కోసం తవ్వకాలు జరుపుతున్న పోలీసులు

పాఠశాల ఆవరణలో 5 మృతదేహాలు

కుటుంబ కలహాల కారణంగానే హత్యలు: పోలీసులు

కడప: స్థానికంగా ఉన్న ఒక పాఠశాల ఆవరణలో పోలీసులు ఐదు మృతదేహాలను వెలికితీయడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి కడప జిల్లా ఎస్పీ నవీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి పోలీసు కార్యాలయంలో ఎస్పీ  మీడియాకు హత్యలకు దారి తీసిన కారణాలతోపాటు నిందితుల వివరాలను వెల్లడించారు.

హత్యకు గురైన కుటుంబం
హత్యకు గురైన కుటుంబం

ఏడాదిన్నర క్రితం అదృశ్యమయ్యారని భావిస్తున్న కృపాకర్ ఐజాక్‌, ఆయన భార్య, పిల్లల మృతదేహాలను జియోన్‌ పాఠశాలలో పూడ్చిపెట్టిఉండగా మంగళవారం పోలీసులు తవ్వి వెలికి తీశారు. ఎవరికీ అనుమానం రాకుండా పాతిపెట్టిన ప్రాంతంలో బండల చప్పట వేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.  మంగళవారం పొక్లెయిన్‌తో సుమారు 15 అడుగులకు పైగా తవ్వి మృతదేహాలను వెలికి తీశారు.

చదవండి :  9న ప్రొద్దుటూరుకు రానున్న ముఖ్యమంత్రి

కృపాకర్  మౌనిక అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు … ఆమె ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి హత్య చేశాడు. తర్వాత మానసికంగా కుంగిపోయి తన ముగ్గురు పిల్లలు ఏంజిల్‌(9), రాజు(7), పవిత్ర(5)లను హత్య చేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వీరందరి శవాలనూ కృపాకర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఒక పాఠశాల ప్రాంగణంలోనే పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలిసినా కృపాకర్ తండ్రి రాజారత్నం ఐజాక్ విషయాన్ని తొక్కిపెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయనను ఈ కేసులో పోలీసులు ముద్దాయిగా చేర్చారు.

చదవండి :  కడప లేదా కర్నూలులో రాజధాని ఏర్పాటు చెయ్యాలి

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హత్యలకు సహకరించిన పాఠశాల బస్సు డ్రైవర్ (చక్రాయపేట మండలం వరికుంటపల్లెకు చెందిన) రామాంజనేయరెడ్డితోపాటు మృతి చెందిన కృపాకర్, కృపాకర్ తండ్రి రాజారత్నం ఐజాక్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదుచేసినట్లు ఎస్పీ తెలిపారు.

మౌనిక తల్లి సుజాత ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ నవీన్‌ గులాఠీ ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించారు. ఈ హత్యోదంతంలో కీలక నిందితునిగా రామాంజనేయుల రెడ్డిని అరెస్టు చేశారు. అలాగే రాజారత్నం ఐజాక్‌ భార్య, కుమారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్న రాజారత్నం ఐజాక్‌ను అదుపులోకి తీసుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఎస్పీ పంపించారు.

చదవండి :  ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డి

‘ఇటువంటి ఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్న మానసిక దౌర్భాల్యాలను, తద్వారా ఎదురయ్యే విపరీత పరిణామాలను ఎత్తి చూపుతున్నాయి’ అని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నభీకోటకు చెందిన కిరణ్ కుమార్ చెప్పినట్లు ‘ఇటువంటి ఘటనలు నివారించడంలో కుటుంబాలదే ప్రధాన పాత్ర’!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *