పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే!

 ఈరోజు కడప కార్పొషన్‌తోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి పురపాలికల పాలకవర్గం కొలువుదీరనుంది.

ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కార్పొరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కడపలో మేయర్, డిప్యూటీ మేయర్, ఆయా పురపాలక సంఘాలలో చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎంపికకు ఎన్నికలు జరుగన్నాయి.

కలెక్టర్ కోన శశిధర్ కడప కార్పొరేషన్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కొత్త పాలకవర్గాల ఎన్నికకు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని  మున్సిపాలిటీలు ముస్తాబయ్యాయి. ఎన్నికకు కేవలం కార్పొరేటర్లు/ కౌన్సిలర్లు మాత్రమే అనుమతిస్తారు.

చదవండి :  జమ్మలమడుగు పురపాలిక పీఠం వైకాపాదే

మూడేళ్ల తరువాత పురపాలక సంఘాలకు కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం 44 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. పాలకవర్గాలు కొలువుతీరేందుకుగాను, దాదాపు 50 రోజుల సమయం పట్టింది.

ఇదీ చదవండి!

జాతీయ రహదారులు

కడప జిల్లాలోని జాతీయ రహదారులు

జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: