
ఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి
గుంతకల్లు – నెల్లూరు దోవ జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఈ దోవలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ పట్టణాలు ఒకదాని తర్వాత మరోటి వరుసగా వస్తాయి. ఈ నాలుగూ పురపాలికలు కావడం ఒక విశేషమైతే ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికలలో ఈ నాలుగూ సైకిల్ చేతికి చిక్కాయి. కడప జిల్లా మొత్తానికి ఈ నాలుగు పురపాలికలు మాత్రమే తెదేపా గెలుచోవటం మరో విశేషం…
– జమ్మలమడుగు పురపాలికలోని 20 వార్డులకు గాను తెదేపా 11, వైకాపా 9 వశం చేసుకున్నాయి.
– ప్రొద్దుటూరు పురపాలికలోని 40 వార్డులకు గాను తెదేపా 22, వైకాపా 18 కైవసం చేసుకున్నాయి.
– మైదుకూరు పురపాలికలోని 23 వార్డులకు గాను తెదేపా 17, వైకాపా 05 కైవసం చేసుకున్నాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
– బద్వేలు పురపాలికలోని 26 వార్డులకు గాను తెదేపా 21, వైకాపా 04 కైవసం చేసుకున్నాయి. ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.