పంటల సాగు వివరాలు – కడప జిల్లా
జిల్లాలో సగటున 10 లక్షల 8 వేల ఎకరాల సాగు భూమి ఉండగా సగటున 9 లక్షల 81 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు జరుగుతోంది.
వరి, వేరుసెనగ, కంది, సెనగ, అలసందలు జిల్లాలో సాగు చేసే ప్రధాన ఆహార పంటలు.
పసుపు, చెరకు, ప్రత్తి, ఉల్లి, పొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప, టమోటా తదితరాలైన వాణిజ్య పంటలు సాగవుతాయి. సాగు భూమిలో సుమారుగా 5 శాతం మేరకు వాణిజ్య పంటలు సాగవుతాయి.
జిల్లా వ్యాప్తంగా 52 శాతం సాగుభూమిలో వర్షాధారంతోనే వేరుసెనగ పంట సాగవుతుంది.
వేరుసెనగః వర్షాధార పంట. ప్రధానంగా రాయచోటి, ఎల్.ఆర్.పల్లి, పులివెందుల, ఎర్రగుంట్ల, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు ప్రాంతాల్లో సాగు చేస్తారు.
వరి: జిల్లాలో కేసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టులలో సాగవుతోంది. వీటితో పాటు బోరుబావులు, చెరువుల కింద జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వరి సాగు చేస్తారు. మొత్తం 67,230 హెక్టార్లలో సాగవుతోంది.
కంది: వర్షాధార పంట. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, ఎర్రగుంట్ల, బద్వేలు ప్రాంతాల్లో కందిని అధికంగా సాగు చేస్తున్నారు.
పత్తి: సాధారణ విస్తీర్ణం 14,983 హెక్టార్లు.
శనగ: వర్షాధార పంట. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. సాధారణ విస్తీర్ణం 55,840 హెక్టార్లు.
పొద్దుతిరుగుడు: వర్షాధార పంట. సాధారణ విస్తీర్ణం 67068 హెక్టార్లు.
ధనియాలు: వర్షాధార పంట. సాధారణ విస్తీర్ణం 9668 హెక్టార్లు.
పసుపు: మైదుకూరు, ఖాజీపేట, కడప, కోడూరు, రాజంపేట, పోరుమామిళ్ల ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.
ఉద్యాన పంటలు..
మామిడి: 24328 హెక్టార్లలో సాగులో ఉంది. ఏటా 164777 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తోంది. ఎక్కువగా కోడూరు, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.
చీనీ: జిల్లాలో 14518 హెక్టార్లలో సాగవుతోంది. ఏటా 241914 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తోంది. పంటను ఎక్కువగా పులివెందుల, కోడూరు,రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు తదితర ప్రాంతాల్లో పండిస్తున్నారు.
నిమ్మ: తెగుళ్ల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం 1870 హెక్టార్లలో సాగవుతోంది. వీటి నుంచి 24990 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. ఈ పంటను కోడూరు, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.
అరటి: జిల్లా నుంచి అరటి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం అరటిలో టిష్యూ కల్చర్ మొక్కలనే వాడుతున్నారు. దుంపలను నాటే విధానాన్ని తగ్గించారు. ఈ పంట ఎక్కువగా కోడూరు, రాజంపేట, పులివెందుల, కడప, బద్వేల్ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.
బొప్పాయి: కోడూరు, రాజంపేట, కడప ప్రాంతాల్లో సాగులో ఉంది.