దాని సొమ్మేమైన తింటీనా… జానపద గీతం

దాని సొమ్మేమైన తింటీనా… జానపద గీతం

వర్గం: హాస్య గీతాలు

దాని సొమ్మేమైన తింటీనా
దానెబ్బ గంటేమైన తింటీనా
దీని సొమ్మేమైన తింటీనా
ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా

దాని సొమ్మేమైన తింటీనా
దానెబ్బ గంటేమైన తింటీనా
దీని సొమ్మేమైన తింటీనా
ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా

తెలిసీ తెలియక అమ్మ ఇల్లరికం నేనొస్తి(2)
డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే
ఆ..డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే

కసువూలూడ్సమని బోకుల్దోమమనే
ఆ..కసువూలూడ్సమనె బోకుల్దోమమనె
వడ్లు దంచమనె మంట బెట్టమనె
వంట సేయమనె
ఆ..ఈ ఇంటి పనులంటే (2)
ఈడ్సీడ్సి తంతాది

చదవండి :  మామరో కొండాలరెడ్డి - జానపదగీతం

దాని సొమ్మేమైన తింటీనా
దానెబ్బ గంటేమైన తింటీనా
దీని సొమ్మేమైన తింటీనా
ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా

సలికాలమొచ్చింది పాడు సలిపెట్టింది (2)
కప్పుకోనూ పాత దుప్పటీ లేదంటే (2)
అప్పొసొప్పో సేసి కొత్త దుప్పటి తెచ్చే (2)
కంబలి త్యాలేదని
ఆ..కంబలి త్యాలేదని
కడతపగలదన్నే

దాని సొమ్మేమైన తింటీనా
దానెబ్బ గంటేమైన తింటీనా
దీని సొమ్మేమైన తింటీనా
ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా

రాగులిసరకచ్చి రాగిసంగటి సేసి
ఆ..రాగులిసరకచ్చి రాగిసంగటి సేసి
తెలవాయి కారెంతో తినలేదు పాపమని
ఆ..తెలవాయి కారెంతో తినలేదు పాపమని
బ్యాల్లపులుసూ సేసి పాప్తంగా నే పెడితే
ఆ..బ్యాల్లపులుసూ సేసి పాప్తంగా నే పెడితే
మునగాకు లేదని
ఆ..మునగాకు లేదని
మూతి పగలదన్నె

చదవండి :  సై..రా నరసింహారెడ్డి - జానపదగీతం

దాని సొమ్మేమైన తింటీనా
దానెబ్బ గంటేమైన తింటీనా
దీని సొమ్మేమైన తింటీనా
ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా

సంకురాత్రి నాడు సంతోషపెడదమని (2)
ముత్తూము వడ్లమ్మి
ఆ..ముత్తూము వడ్లమ్మి
కొత్త సీరె తెచ్చే
ముత్తూము వడ్లమ్మి కొత్త సీరె తెచ్చే
ఆ..ముద్దరాల సీరె కట్టుకో కట్టుకోమంటే (2)
అంచు తక్కువని ఊంచూంచి తంతాది

దాని సొమ్మేమైన తింటీనా
దానెబ్బ గంటేమైన తింటీనా
దీని సొమ్మేమైన తింటీనా
ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా

చదవండి :  నీళ్ళకు బోర తిమ్మ - జానపదగీతం

పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: