“.. తెలుగు లెస్స ”అన్నది ” మోపూరు ” వల్లభరాయలే!

జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశ భాషలందు దెనుగు లెస్స

జగతి దల్లి కంటె సౌభాగ్య సంపద

మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె

( క్రీడాభిరామం -రచన వినుకొండ వల్లభరాయుడు.)

కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని మోపూరు గ్రామంలోని భైరవేశ్వర ఆలయం నేటికీ  వుంది. ఇది వీరశైవులకు ప్రసిద్ధ క్షేత్రం. (క్రీ.శ.1423 -1445) ప్రాంతంలో విజయనగర పాలకుడు ప్రౌఢ దేవరాయలు పరిపాలించేవారు. డిండిమ భట్టారకుని జయించాలన్న తపనతో శ్రీనాథుడు వున్నారు. ఆ సమయంలో మోపూరు పాలకుడుగా వల్లభరాయుడు వుండేవారు.

ఆ సమయంలో విజయనగర ఆస్థానానికి వెళ్లడానికి మోపూరు గ్రామానికి శ్రీనాథుడు సిఫారసు కోసం వచ్చివుంటారని ఆ సందర్భంలో క్రీడాభిరామం రచన జరిగి వుంటుందని అందులో శ్రీనాథుడు సలహా, సూచనలో వల్లభ రాయుడు రచన సాగించి వుండవచ్చునని అభిప్రాయం చాలామందికి ఉంది.

చదవండి :  పశుగణ పరిశోధనా కేంద్రాన్నిఉపయోగంలోకి తీసుకురండి

“క్రీడాభిరామం” లోని 22వ పద్యంలో

“మూడు గ్రామ గ్రాసముల తొర గూడుగ మోపూరు పాలించె ముల్కినాట…” అని ఉంది.

“వల్లభ రాయుడు” తిప్పన నాయుడు కుమారుడు అని ఈ పద్యం ద్వారా తెలుస్తున్నది. అలాగే వల్లభ రాయుడు రచనలు చేసారని కూడా తెలియవస్తున్నది. క్రీడాభిరామం రచన కాలం క్రీ.శ. 1440 గా భావిస్తున్నారు. 1530 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు “దేశభాష లందు తెలుగు లెస్స” అని భావించడానికి శ్రీకృష్ణ దేవరాయలు అప్పటికే క్రీడాభిరామం చదివి ఉండవచ్చు. అలాగే విజయనగర ప్రభువులు మోపూరు ప్రాంతాన్ని సందర్శించడం కూడా జరిగినట్లు తెలుస్తున్నది. “దేశ భాషలయందు తెలుగులెస్స” అని ప్రకటించినది శ్రీకృష్ణ దేవరాయలుగా నేటికి  భావిస్తున్నారు. వాస్తవానికి ఆ ఘనత వ్లలభ రాయుడికి దక్కాలి.

చదవండి :  వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

అలాగే వినుకొండ వల్లభరాయుడు గుంటూరు ప్రాంతంలోని వినుకొండ ప్రాంతానికి చెందినట్లు కొందరు  భావిస్తున్నారు. క్రీ.శ. 1425 నాటి మోపూరు బైరవేశ్వరుని ఆలయంలోని శాసనం ప్రకారం అందులో వేముల (మీది పెంట్ల గ్రామం) పాలెగారుగా తిప్పినాయుడు వున్నట్లు తెలుస్తుంది. తిప్పనాయుడు కుమారుడు వల్లభరాయుడుగా తెలుస్తున్నది. కైఫియత్తులను బట్టి వల్లభరాయుడు మీది పెంట్ల పాలెగాడుగా భావించవచ్చు.

 క్రీడాభిరామంలో 295 పద్యాలు ఉన్నాయి. తెలుగు సాహితీ లోకంలో ఇదొక గొప్ప కావ్యం ఆనాటి ప్రజల జీవన విధానాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు, ఆనాటి విశ్వాసాలు, ఆచారాలు, దురాచారాలు, ఆనాటి వినోదాలు, క్రీడాభిరామం ద్వారా తెలుస్తున్నాయి. “క్రీడాభిరామం” రచించింది శ్రీనాధుడా ?వినుగొండ వల్లభరాయుడా ? అనే విషయం గతంలో చర్చ కూడా జరిగింది.

చదవండి :  పులివెందులలో ఎవరికెన్ని ఓట్లు?

రావిపాటి త్రిపురాంతక దేవుడు తెలుగు సాహితీ వేత్తల్లో తొలిసారి దృశ్య కావ్యరచనలు పూనుకొన్న కవి. కాకతీయ రాజ్యాన్ని రెండవ ప్రతాపరుద్రుడు పాలించే కాలంలో  “వీధి నాటకము” అ అనే దృశ్యకావ్య పద్ధతిలో “ప్రేమాభిరామము” అనే కావ్యాన్ని సంస్కృతంలో రచించారు. తరువాత ప్రేమాభిరామంను అనుసరించి క్రీడాభిరామంను తెలుగులోకి అనువదించారు. “క్రీడాభిరామం” కావ్యాన్ని శ్రీనాథుడు రచించినట్లుగా  వేటూరి ప్రభాకర శాస్త్రి పేర్కొన్నారు.

శ్రీనాథ కవి సహాయంతో . “క్రీడాభిరామం” కావ్యాన్ని వల్లభ రాయుడు రాసారని బండారు తమ్మయ్యగారి అభిప్రాయం. చిలుకూరి పాపయ్య శాస్త్రి అదే అభిప్రాయం వెలిబుచ్చారు. టేకుమళ్ల అచ్యుతరావు వల్లభ రాయుడు రాసారని , మానవల్లి రామకృష్ణకవి తొలుత శ్రీనాథుడు రాసారని ప్రకటించి తరువాత వల్లభరాయుడు రాసారని నిర్ధారించారు. అలాగే కుందూరి ఈశ్వరదత్త కూడా అలాగే ప్రకటించారు.

ఇదీ చదవండి!

పశుగణ పరిశోధనా కేంద్రంలో జగన్

పశుగణ పరిశోధనా కేంద్రాన్నిఉపయోగంలోకి తీసుకురండి

ప్రభుత్వానికి విపక్షనేత జగన్ విజ్ఞప్తి పులివెందుల: 247 కోట్ల రూపాయల నిధులూ, 650 ఎకరాల క్యాంపస్ కలిగిన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని …

ఒక వ్యాఖ్య

  1. ఈ సంగతి చాలామంది కి తెలిసిందే.ఐతే శ్రీకృష్ణదేవరాయలు అంత చక్రవర్తి వ్రాయడం వలన బాగా వ్యాప్తి లోకి వచ్చిఉంటుంది.కృష్ణదేవరాయలు ముందు ఉన్నదానినే పునరుద్ఘాటించాడని అనుకోవచ్చును.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: