Tags :katta narasimhulu

    పర్యాటకం శాసనాలు

    పౌరాణిక భౌగోళిక చారిత్రక ప్రాధాన్యాన్ని నింపుకొన్న ఒంటిమిట్ట

    పౌరాణికం 1. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నపుడు సీతమ్మ కోసం రామయ్య బాణం సంధించి భూమి నుంచి నీరు తెప్పించిన చోటు ఇక్కడుంది. అక్కడే నేడు రామతీర్థం వెలసింది. 2. సీతమ్మ కోసం వెతుకుతూ జాంబవంతుడు ఇక్కడ ఒక రాత్రి నిద్రించాడు. మరునాటి ఉదయం ఒక శిలలో సీతారామలక్ష్మణుల్ని, భావించి నమస్కరించి అన్వేషణకు బయలుదేరాడు. ఈ గుట్ట మీద నిర్మాణం అయిందే కోదండరామాలయం. భౌగోళికం తిరుమల నుంచి కడపకు వస్తున్న శేషాచలం కొండలు ఒంటిమిట్టను దాటుకొంటూ విస్తరించాయి. ఆ […]పూర్తి వివరాలు ...

    వ్యాసాలు

    గువ్వలచెన్న శతకకర్త ఘటికాశతగ్రంథి పట్టాభిరామన్న

    గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! సప్తసంతానాలు కొన్నింటిని పేర్కొని అవన్నీ ఒకనాటికి నశించిపోయేవే కాని చెడనిది పద్యం ఒక్కటే అని చెబుతున్నది గువ్వల చెన్న శతకం. ఇలాంటి ఆణిముత్యాలు మరికొన్ని ఉన్నాయీ శతకంలో. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ వారు ఈ శతకాన్ని అధిక్షేపశతకం క్రింద ప్రచురించారు. శతక రచనా కాలానికి చెందిన సామాజికాంశాలు ఈ శతకంలో చోటు చేసుకొన్నాయి. ‘ఆంధ్రుల సాంఘిక […]పూర్తి వివరాలు ...

    చరిత్ర వ్యాసాలు

    భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

    – విద్వాన్ కట్టా నరసింహులు బమ్మెరపోతన ఆంధ్రమహాభాగవత రచనకు కొన్నాళ్లముందు చంద్రగ్రహణం నాడు గంగలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నాడు. అది మహేశ్వర ధ్యానం. ధ్యానంలో దర్శనమిచ్చినవాడు శ్రీరామభద్రుడు. భాగవతం రచించమన్నాడు. ఆయనకు కలలో కనిపించిన రాముడిలా ఉన్నాడు: మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి ఉవిద చెంగట నుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బఱగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి […]పూర్తి వివరాలు ...

    చరిత్ర వ్యాసాలు

    చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

    గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! వంటి పద్యాలతో గువ్వల చెన్న శతకం శతకసాహిత్యంలో వన్నె కెక్కింది. ఆ నాటి సామాజికాంశాలను ప్రస్ఫుటంగా ప్రకటించి అధిక్షేపశతకాల్లో ఒకటిగా నిలిచింది. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాల చరిత్రలు వందల వేల సంవత్సరాలవి కాగా మద్రాసు లేదా చెన్నపట్టణం అని పిలువబడుతూ ఉండిన నేటి ‘చెన్నయ్‌’ నగర చరిత్ర క్రీస్తు శకం పదిహేడో శతాబ్దం […]పూర్తి వివరాలు ...

    చరిత్ర వ్యాసాలు

    అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

    ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. ఇందలి కొన్ని పద్యాలను కస్తూరి రంగకవి తన ఆనందరంగరాట్ఛందంలో ఉదాహరించాడు. శ్రీకృష్ణరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. అప్పటికే ఆ రాజ్యం […]పూర్తి వివరాలు ...

    కైఫియత్తులు వ్యాసాలు

    “.. తెలుగు లెస్స ”అన్నది ” మోపూరు ” వల్లభరాయలే!

    జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు దెనుగు లెస్స జగతి దల్లి కంటె సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె ( క్రీడాభిరామం -రచన వినుకొండ వల్లభరాయుడు.) కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని మోపూరు గ్రామంలోని భైరవేశ్వర ఆలయం నేటికీ  వుంది. ఇది వీరశైవులకు ప్రసిద్ధ క్షేత్రం. (క్రీ.శ.1423 -1445) ప్రాంతంలో విజయనగర పాలకుడు ప్రౌఢ దేవరాయలు పరిపాలించేవారు. డిండిమ భట్టారకుని జయించాలన్న తపనతో శ్రీనాథుడు వున్నారు. ఆ సమయంలో మోపూరు పాలకుడుగా వల్లభరాయుడు వుండేవారు. […]పూర్తి వివరాలు ...