drinking water

తాగే నీళ్ళ కోసం 14.40 కోట్లడిగితే 1.90 కోట్లే ఇచ్చారా!

కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు చెప్పిన సమాచారం ఆసక్తికరంగా ఉంది.

బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు జిల్లాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని వైకాపా ప్రజాప్రతినిధులు కోరగా జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం కేవలం రూ.1.90 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని మరో రెండు కోట్లు విడుదల చేయిస్తేనే తాగునీటి సరఫరా పరిస్థితి మెరుగుపడుతుందని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ ఆవేదనగా చెప్పడం జిల్లా పట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది.

ఇష్టం వచ్చినట్లుగా ఇసుక క్వారీలకు అనుమతులిచ్చి నీటి ఎద్దడి ఏర్పడేలా చేయవద్దని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు.   ఈ సందర్భంగా కమలాపురం నియోజకవర్గంలో చెరువుకిందపల్లె, ఓబులంపల్లె, అనిమెల ఇసుక రీచ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల ఆయా ప్రాంతాలలో ఉన్న తాగునీటి స్కీంలు ఎండిపోయి నీటిఎద్దడి ఏర్పడే అవకాశముంద ని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పగా, రాయచోటి నియోజకవర్గంలో రోళ్లమడుగు వద్ద ఇసుకక్వారీని రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చెన్నూరు సమీపంలోని ఓబులంపల్లె వద్ద ఏర్పాటు చే స్తున్న ఇసుక క్వారీ వల్ల కడప నగరప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా ఫిర్యాదు చేశారు.

చదవండి :  ఆం.ప్ర ప్రభుత్వం వర్మ పైన కేసు పెడుతుందా?

వైఎస్ జగన్‌ మాట్లాడుతూ ఇసుక రీచ్‌లకు అనుమతిచ్చేటప్పుడు అధికారులు వాస్తవ పరిస్థితులను అధ్యయం చేసి ఎక్కువ మందికి మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి సామాన్య ప్రజలకు అన్యాయం చేయవద్దని సూచించారు. ఇష్టానుసారంగా ఇసుకక్వారీలకు అనుమతిస్తే తాగేందుకు నీరుండదని హెచ్చరించారు. భూగర్భ జల శాఖ అధికారుల నుంచి క్వారీలకు అనుకూలంగా నివేదిక వస్తేనే అనుమతి ఇవ్వాలన్నారు.

లేనిపక్షంలో తాను ప్రయివేటు సంస్థలచే సర్వే చేయించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అంతవరకూ తేవద్దని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ శ్రీనువాసులుకు సున్నింతంగా హెచ్చరిక చేశారు. సోమశిల బ్యాక్ వాటర్ స్కీం కింద తెచ్చిన పైపులు ఒట్టిపోతున్నాయని, కడప, ప్రొద్దుటూరు, ట్రిపుల్ ఐటీలకు నీరిందించే ఈ పథకం ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. ఎంపీ నిధులు రూ. 5 కోట్లు తాగునీటి పనులకే ఖర్చు చేస్తున్నా ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ వల్ల మేలు జరిగే పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదని అసంత్పప్తి వ్యక్తం చేశారు. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇందుకు అన్ని చోట్లా చేస్తున్నామని ఎస్‌ఈ సమాధానమివ్వగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఎక్కడ చేశారో స్పష్టంగా చెప్పాలని, అవాస్తవాలు చెప్పవద్దని నిలదీశారు.

చదవండి :  ఈ కలెక్టర్ మాకొద్దు

ఎస్‌ఈ స్పందిస్తూ తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరగా, రూ.1.90 కోట్లు మంజూరు చేసిందని సమాధానమిచ్చారు. మరో రెండు కోట్లు విడుదల చేయిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. రూ.3900 కోట్లతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు 24 గంటలు తాగునీరు సరఫరా చేసేలా వాటర్ గ్రిడ్‌లో ప్రతిపాదించామన్నారు. అంత బడ్జెట్ ప్రభుత్వం విడుదల చేస్తుందా అని జగన్ అధికారులను ప్రశ్నించారు. గతంలో పంచాయితీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన కరెంటు చార్జీలను ప్రభుత్వమే చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భారమంతా స్థానిక సంస్థలపై వేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

చదవండి :  ప్రమాణ స్వీకారం చేసినారు...ఆయనొక్కడూ తప్ప!

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపుకోవాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 890 కీ.మీల మేర 314 రోడ్లు నిర్మించడానికి రోడ్ గ్రిడ్ కింద రూ.193 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని పంచాయితీరాజ్ ఎస్‌ఈ నాగేశ్వరరావు తెలిపారు.

కడప జిల్లాకు మౌలిక అవసరాల కోసం కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే అధికారులు మాత్రం ఏం చేయగలరు? ప్రతిపక్షం కూడా ఇటువంటి తక్షణావసరాల విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు, అవసరమైన నిధులు విడుదల చేయించేందుకు కృషి చేయాలి.  అలాగే  స్థానిక తెదేపా నేతలు కూడా ఈ దిశగా కృషి చేయాల్సిన అవసరముంది. లేదంటే ప్రజలు వచ్చే ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి కోసం అగచాట్లు పడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి!

మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: