కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేకపోతున్నా…

మాజీ మంత్రి,  వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, వై.ఎస్‌.వివేకానందరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు వైఎస్‌ను తిడుతుండటాన్ని జీర్జించుకోలేకే తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తండ్రి వైఎస్‌ రాజారెడ్డి వర్థంతి సందర్భంగా పులివెందులలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేకపోతున్నాననీ, పార్టీ కోసం కుటుంబాన్ని దూరం చేసుకున్నా తనకు తగిన గౌరవం ఇవ్వలేదనీ అన్నారు.

రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో నిలబెట్టిన వైఎస్‌ని కాంగ్రెస్‌ నేతలే నానా మాటలు అంటుండడం తనను బాధించిందనీ ఆయన కార్యకర్తల ఎదుట వాపోయారు. ఈ నేపథ్యంలోనే తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివేకా ప్రకటించారు. రాజీనామా ప్రకటన కంటే ముందు పలుదఫాలుగా ఆయన కార్యకర్తలు, నాయకులతో సుధీర్ఘంగా మంతనాలు జరిపారు.

చదవండి :  జులై 2న కడప విమానాశ్రయం ప్రారంభం కానుందా?

ప్రస్తుతానికైతే వైఎస్‌ వివేకా తన తదుపరి రాజకీయ భవిష్యత్‌ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాను ఏ పార్టీలో చేరేది రెండు, మూడ్రోజుల్లో చెబుతానని తెలిపారు. వివేకా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరతారా లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా?

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: