కడప జిల్లాకు కొత్త కలెక్టర్

కడప జిల్లాకు కొత్త కలెక్టర్

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని కడప జిల్లా కొత్త కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం జాయింట్ కలెక్టర్ రామారావు నుంచి ఆయన కడప జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2003 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు.

చదవండి :  మార్చి 18 నుంచి కడపలో సీఆర్‌పీఎఫ్ ఎంపికలు

కలెక్టర్ రమణకు జాయింట్ కలెక్టర్ రామారావు, అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో సులోచన, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇంతకు ముందు ఇక్కడ కలెక్టర్ గా పని చేసిన కోన శశిధర్ ను ప్రభుత్వం ఈ-సేవ డైరెక్టర్ గా  బదిలీ చేయటంతో ఆయన జాయింట్ కలెక్టర్ కు భాద్యతలు అప్పగించి ఈ మధ్యనే రిలీవ్ అయ్యారు.

కడప జిల్లా కలెక్టర్ గా  భాద్యతలు స్వీకరించిన రమణ గారికి శుభాకాంక్షలు!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *