కమలాపురం ఉరుసు ముగిసింది

కమలాపురం ఉరుసు గోడపత్రం

కమలాపురం ఉరుసు ముగిసింది

కమలాపురం హజరత్ అబ్దుల్ గఫార్‌షాఖాద్రి ఉరుసు ఘనంగా ముగిసింది. ఈనెల 14న నషాన్‌తో ప్రారంభం కాగా గురువారం తహలీల్‌తో ముగిశాయి. గురువారం ఉదయం దర్గా ఫీఠాధిపతి గఫార్‌స్వామి ఆధ్వర్యంలో గంధం ఇంటి నుంచి వూరేగింపుగా గంధాన్ని, పూలను తీసుకువచ్చి దర్గాలో ఎక్కించారు.

నషాన్ సందర్భంగా దర్గాలో ప్రతిష్ఠించిన జెండాను కిందికి దించారు. స్వామి మజార్లపై పూలఛాదర్లు సమర్పించి భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిందూ, ముస్లిం భక్తులు చక్కెర చదివింపులు చేసి, పంచిపెట్టారు. పీఠాధిపతి సోదరులు జియా, మౌలానా, గౌస్‌పాక్, దస్తగిరి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

చదవండి :  కమలాపురం శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *