
రాజీవ్‌గాంధి వైద్య విద్య, విజ్ఞాన సంస్థ – కడప
ఆగష్టు 1 నుంచి రిమ్స్ లో మొదటి సంవత్సరం తరగతులు
ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాజీవ్‌గాంధి వైద్య విద్య, విజ్ఞాన సంస్థ అనుబంధ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తామని సంచాలకుడు డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ ప్రకటించారు. కౌన్సిలింగ్ ద్వారా కడప రిమ్స్ లో సీటును పొందిన విద్యార్థులు ఈ నెల 31 లోగా కళాశాలలో చేరవలసి ఉంది.
తొలిరోజు పది మంది ప్రవేశాలు పొందగా.. శుక్రవారం ఈ సంఖ్య పెరిగింది. వెయ్యి మొదలు కొని పదిహేను వందల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు రిమ్స్‌లో చేరేందుకు వస్తున్నారు. వీరందరికీ ప్రధానాచార్యులు డాక్టర్ బాలకృష్ణ ప్రవేశ పత్రాలు అందిస్తున్నారు.
పీజీ అభ్యసించే వైద్యులు శుక్రవారం మరో ఇద్దరు వచ్చి చేరారు.