శనివారం , 7 డిసెంబర్ 2024

జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది!

కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిన తరుణం ఆసన్నమైందని.. ఉద్యమాలను ఉద్ధృతం చేసి జిల్లాను అభివృద్ధి వైపు నడిపించడానికి ముందుకు సాగుదామని అఖిలపక్షం తీర్మానించింది.

గురువారం స్థానిక వైఎస్సార్ పాత్రికేయ మందిరంలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

చదవండి :  ఢిల్లీలో మకాం వేసిన ప్రత్యర్థులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సాగు, తాగునీరందక ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వలసలు వెళుతున్న పరిస్థితులు జిల్లాలో ఉన్నాయన్నారు.  ముఖ్యమంత్రి, మంత్రులు చాలాసార్లు జిల్లాలో పర్యటించినా ఒక్క అభివృద్ధి పనికి కూడా శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవన్నారు.

జిల్లాకు రావాల్సిన అపెరల్ పార్కు, ఫుడ్‌ఫార్కు, ఉర్దూ విశ్వవిద్యాలయం, విమానాశ్రయం, ఉక్కు పరిశ్రమ, పెండింగు ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు మొదలైన విషయాలలో పోరాటాలు చేసి సాధించుకుందామన్నారు.

అభివృద్ధిని మరిచారు

జిల్లాలో సాగు, తాగునీటికి పథకాలకు మోక్షం లేదు. ఇలాగే కొనసాగితేరానున్న నాలుగేళ్లలో జిల్లా వాసులు అనేక కష్టాలు పడక తప్పదు. జలయజ్ఞం పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లాకు సాగు నీటిని తెప్పించడానికి ఎక్కడ అడ్డంకులు ఉన్నాయనేది గుర్తించి చర్యలు తీసుకోవాలి.

చదవండి :  మైదుకూరు, ఎర్రగుంట్లలలో అభ్యర్థులు దొరకలేదు

– శెట్టిపల్లి రఘురామిరెడ్డి, మైదుకూరు శాసనసభ్యుడు

నిలదీసి అభివృద్ధిని సాధించుకుందాం

రాయలసీమలో కడప జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఒక్క అభివృద్ధి పనిని ప్రారంభించిన దాఖలాలు లేవు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రభుత్వాన్ని నిలదీసి అభివృద్ధిని సాధించుకుందాం.

– అంజాద్‌బాషా, కడప శాసనసభ్యుడు

ప్రభుత్వాన్ని నిలదీయాలి

జిల్లా అభివృద్ధి అందరి బాధ్యత. అధికారులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. బద్వేలు వెనుకబడిన ప్రాంతం. బ్రహ్మంసాగర్‌కు శ్రీశైలం నుంచి నీటిని తెప్పించాలి. కడపను విస్మరించిన ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల్లో నిలదీయాలి.

– జయరాములు, బద్వేలు శాసనసభ్యుడు

సమష్టిగా పోరాడుదాం…

రాష్ట్రానికే తలమానికమైన బెరైటీస్ ద్వారా 20 వేల మందికి జీవనోపాధి లభిస్తోంది. వాటిని మూసివేత దిశగా చర్యలు తీసుకోవడం దారుణం. జిల్లాకు అన్ని విధాలా అభివృద్ధి జరిగే వరకు పోరాటాలు చేయడానికి సమష్టిగా ముందుకు సాగుదాం. ముఖ్యమంత్రిని కలిసి జిల్లా సమస్యలు పరిష్కరించమని అడుగుదాం.

చదవండి :  బట్టలు విప్పి కొడతారా!

– శ్రీనివాసులు, కోడూరు శాసనసభ్యుడు

చట్టసభల్లోనూ పోరాటం

ముగ్గురాళ్ల గనుల విషయంలో అన్యాయం జరిగిందని ప్రభుత్వం భావించడం దారుణం. పల్వరైజింగ్ మిల్లులపై చర్యలు తీసుకోవడం సరికాదు. జిల్లాకు న్యాయపరంగా రావాల్సిన ప్యాకేజీపై చట్టసభల్లో గళం విప్పి పోరాటం చేద్దాం.

– నారాయణరెడ్డి, శాసనమండలి సభ్యుడు

సమావేశంలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, తెదెపా నాయకుడు హరిప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఐకాసా నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహమ్మద్, ఆప్ నాయకుడు శివారెడ్డి, రైతు సంఘం నాయకుడు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

జిల్లా కేంద్రంగా కడప

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: