మైదుకూరు, ఎర్రగుంట్లలలో అభ్యర్థులు దొరకలేదు

శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పరిస్థితి కడప జిల్లాలో దయనీయంగా మారింది. ఈనెల 30న జరిగే పురపాలక పోరులో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే నాధుడే కరవయ్యారు.

జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య రెండంకెలకు మించలేదు.

ముఖ్యంగా మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాల్టీల్లో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది.

చదవండి :  జిల్లాలో 48 కరువు మండలాలు

కడప కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను కేవలం 13 మంది , మిగిలిన ఏడు మున్సిపాల్టీల్లోని 236 వార్డులకు 76 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.

ఉప సంహరణ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇదీ చదవండి!

అరటి పరిశోధనా కేంద్రం

పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: