నా కొడకా నాగయో…. జానపదగీతం

నా కొడకా నాగయో…. జానపదగీతం

వర్గం: కలుపు పాట

పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏకతాళం)

దాయాదుల కారణంగా కొడుకు వ్యసనాలు మరిగి చివరకు జైలు పాలయినాడు. సర్కారోల్లు ఇంటికొచ్చి కొడుకుకు బేడీలు వేసి తీసుకుపోవటంతో అవమానపడిన ఆ తల్లి బాధతో రగిలిపోయింది. ఆ తల్లి బాధను జానపదులు ఇలా పాటగా పాడినారు..

నగుమాసం నినుమోసి
నినుకంటిరో నా కొడకో
నాకగుమానం సేస్తివిరో
నా బాలనాగయో

దాయాదుల దోవలోన
పోవద్దంటే ఇనకపోతివిరో
ఆరి కూతలు ఇని సెడితివి
నా బాలనాగయో

సారాయి జూదం మరిగి
సంసారం వీగితివిరో
నీవెంతా పనీ సేస్తివిరో
నా బాలనాగయో

సర్కారూ ఇంటికొచ్చి
కేడీవని నీకూ బేడీలేత్తే
నా కన్నకడుపూ కాలిపాయ
నా కొడకా నాగయో

పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య, దొమ్మరనంద్యాల, కడప జిల్లా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: