ఆదివారం , 22 డిసెంబర్ 2024
ttd kalyanotsavam

వీరబల్లిలో ఈపొద్దు ఏడుకొండలరాయుడికి పెళ్లి

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని తితిదే ఆధ్వర్యంలో ఆదివారం వీరబల్లిలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం వేదిక కానుంది.

ఇందుకు సంబంధించి తిరుమల, తిరుపతి దేవస్థాన కల్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం అన్నప్రసాదాలు, అమ్మవారి కుంకుమ, పసుపు పంపిణీ చేయనున్నట్లు తితిదే ఎస్ఈ రామచంద్రారెడ్డి, కల్యాణ ప్రాజెక్టు ఎస్ఓ రామచంద్రారెడ్డి తెలిపారు.

చదవండి :  ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి

శ్రీనివాస కల్యాణాన్ని భక్తులందరి చేత వీక్షింపజేయాలనే సదుద్దేశంతో మండలంలో ఏర్పాటు చేశామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం జూనియర్ ఎగ్జికూటివ్ అధికారి కోలా భాస్కర్ – సొంత మండలం కావడంతో ప్రత్యేక శ్రద్ద కనపర్చారన్నారు. దాదాపు 10 వేల మంది భక్తు లు హాజరవుతారని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తితిదే ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కల్యాణ మహోత్సవానికి భక్తులు విరివిగా హాజరై శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

చదవండి :  రేపటి నుంచి పాలేటమ్మ తిరుణాళ్ళ

ఇదీ చదవండి!

cvnagarjunareddy

జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి – హైకోర్టు న్యాయమూర్తి

పేరు : జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి పుట్టిన తేదీ: 05.12.1956 స్వస్థలం : యడబల్లి, గడికోట గ్రామం, వీరబల్లి మండలం, కడప …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: