Tags :veeraballi

    వార్తలు

    కమనీయం… కోనేటిరాయుని కళ్యాణం

    వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవర ణలో ఆదివారం అంగరంగ శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు, వేదపండితుల వేదమంత్రోచ్చారణల మధ్య కోనేటిరాయుని కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణలతో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం పులకించింది. కల్యాణానికి ముఖ్యఅతిధులు గా ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ రామారావులు హాజరయ్యారు. కార్యక్రమంలో తిరుమల, తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు

    వీరబల్లిలో ఈపొద్దు ఏడుకొండలరాయుడికి పెళ్లి

    కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని తితిదే ఆధ్వర్యంలో ఆదివారం వీరబల్లిలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం వేదిక కానుంది. ఇందుకు సంబంధించి తిరుమల, తిరుపతి దేవస్థాన కల్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం అన్నప్రసాదాలు, అమ్మవారి కుంకుమ, పసుపు పంపిణీ చేయనున్నట్లు తితిదే ఎస్ఈ రామచంద్రారెడ్డి, కల్యాణ ప్రాజెక్టు ఎస్ఓ రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీనివాస […]పూర్తి వివరాలు ...