ఆనకట్టలు తెగే కాలం (కవిత) – డా. ఎం హరికిషన్

ఆనకట్టలు తెగే కాలం (కవిత) – డా. ఎం హరికిషన్

జండా యెగరేసి
పప్పూబెల్లాలు పంచిపోవడం కాదు
వ్యధల సీమలో వెలుగుపూలు పూయించే
అజండా యేమిటో విప్పి చెప్పు

సమన్యాయం సమాధయి
సమదూరం వెక్కిరిస్తోంది …..
రాజధానే కాదు
అన్నిటి ప్రవాహమూ అటువైపే …

వికేంద్రీకరణంటే ….
ఖాళీ గిన్నెలో
తలావొక మెదుకు విదిల్చడం కాదు
అడుగుతున్నది భిక్ష అంతకంటే కాదు….

ఒప్పందాలకు నీళ్ళొదిలినందుకే కదా
ఆత్మ ఒకటైనా దేహాలు విడివడింది
ఆ గాయాల తడి ఇంకా ఆరనే లేదు

మళ్ళా అదే పడగ నీడ
అదే విక్రుత క్రీడ ….

మోసపోవడం మా నరనరాల్లో ఇంకిపోయి వుండొచ్చు
నిర్లిప్తత కరువు నేలలో భాగమై వుండొచ్చు ….

ఆనకట్టలు తెగే కాలం కూడా
ఒకటుందని మరచి పోవద్దు ….
చిన్న గండి చాలుకదా
కొత్త పురుడుకి ఆజ్యం పోయడానికి

– డా. ఎం హరికిషన్ , కర్నూలు

+91-9441032212

(ఆగస్టు 15న మాన్య ముఖ్యమంత్రి గారు కర్నూలు వచ్చిన సందర్భంలో)

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: