కడప: కడప జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతున్నాడని రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన రాయచోటిలోని వైకాపా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించి కోస్తా- ఆంధ్రలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కడప జిల్లాకు రావాల్సిన డీఆర్డీవో పరిశోధనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు కేటాయించుకోవడం అన్యాయమన్నారు. దీనిపై తెదేపా జిల్లా నేతలు కూడా నోరు మొదపలేదన్నారు. కడపలో విమానాశ్రయం పూర్తయినా ఇంత వరకు ప్రారంభించలేదన్నారు. […]పూర్తి వివరాలు ...
Tags :కడప జిల్లా
కమలాపురం: కడప జిల్లా పై ప్రభత్వ వివక్షకు నిరసనగా మరియు జిల్లా సమగ్రాభివృద్ధిని కోరుతూ.. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అన్ని మండల కార్యాలయాల ఎదుట సీపీఐ, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని, ప్రజలు కూడా పాల్గొని ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. వనరుల ఆధారంగా సమగ్రంగా అభివృద్ధి చేయకపోతే.. జిల్లా శాశ్వత ఏడారిగా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించకుండానే జిల్లాను […]పూర్తి వివరాలు ...
18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ పంటకు అను వైన జూన్, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం: 1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా సంస్థలేవీ కడప జిల్లా ఛాయలకు రాకుండా చేశారు. కానీ కేవలం 11 పరిశ్రమలున్న కడప జిల్లాలో(Src:www.apind.gov.in/library/district/kadapa.pdf) పన్నెండో పరిశ్రమ నిర్మిస్తున్నందుకే ఇంకేమీ లేకుండా […]పూర్తి వివరాలు ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు కడప జిల్లాలో పర్యటించనుంది. ఉదయం 10.30 గంటలకు కడపలోని సభా భవనంలో జిల్లా అధికారులతో కమిటీ సమావేశం కానుంది. కొత్త రాజధాని ఏర్పాటుపై అభిప్రాయాలు, వినతలు స్వీకరించనుంది. ఇప్పటికే ఒకసారి ఆయా ప్రాంతాలలో పర్యటించి పర్యటనలు పూర్తైనట్లు ప్రకటించిన శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడు మళ్ళీ పర్యటిస్తుండడం వెనుక మతలబు ఏమిటో? ఒక పక్క కమిటీ ఇలా పర్యటనలు చేస్తోంటే రాష్ట్ర మంత్రులూ, ముఖ్యమంత్రీ రాజధాని, […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: రాష్ట్ర విభజనానంతరం కడప జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని జవివే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా సురేష్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు రమణయ్య శుక్రవారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వంపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ జిల్లాను ఇంకా సందర్శించలేదన్నారు. ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థ ను ప్రకటించలేదని, రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా పర్యాటక రంగానికి మరోసారి అన్యాయం జరిగింది. కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీవద్ యశో నారాయణ మంగళవారం పార్లమెంటులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యాటకాభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను లిఖిత పూర్వకంగా వివరించారు. మన రాష్ట్రానికి సాధారణ సర్క్యూట్ విభాగంలో పది ప్రాజెక్టులను కేటాయించారు. సాధరణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదికలకు అనుగుణంగా కేంద్రం ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తుంది.. అందులో గుంటూరుకు మూడు కేటాయించి పశ్చిమ గోదావరికి రెండు, చిత్తూరు (శ్రీకాళహస్తి)కు […]పూర్తి వివరాలు ...
నగరంలోని సీపీ బ్రౌన్ లైబ్రరీలో జులై 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ‘కడప జిల్లా భవిష్యత్? ‘ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నామని జనవిజ్ఞానవేదిక (జవివే) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గేయానంద్‌లు సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. ఉపన్యాసకులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాల్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా అంటే అదేదో వినకూడని పేరైనట్లు ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తుంటే తాజాగా రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తానేమీ తక్కువ తినలేదని నిరూపించింది.రాయలసీమలోని మూడు జిల్లాలను పరిశీలించిన సదరు కమిటీ సభ్యులు ఒక్క కడప జిల్లాను మాత్రం విస్మరించారు. ఎంచేత? ప్రభుత్వ పెద్దలూ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులూ అంతా కమిటీతో సంబంధం లేకుండా తమ సామాజికవర్గం, ధనికుల ప్రాబల్యం అధికంగా ఉండే గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించేశారు. […]పూర్తి వివరాలు ...