స్మారక శిలలు, వీరగల్లులు … శాసన భేదాల్లో స్మారక శిలలు, వీరగల్లులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు, దైవానుగ్రహం కోసం ఆత్మబలి చేసుకున్న భక్తులకు స్మారక శిలలను ప్రతిష్ఠించే ఆచారం ఉండేది. బృహచ్ఛిలాయుగం నాటి సమాధులు, చారిత్రక యుగం నాటి ఛాయాస్తంభాలు, బౌద్ధస్తూపాలు కూడా స్మారక చిహ్నాలేనని చరిత్రకారుల అభిప్రాయం. రాజులు, రాణులు, మత గురువులు మరణించినప్పుడు వారి స్మృత్యర్థం ఛాయాస్తంభాలను నిలిపేవాళ్లు మరణించినవారి ఛాయ ఈ స్తంభంలో ఉంటుందని ఆనాటి […]పూర్తి వివరాలు ...
Tags :కడప జిల్లా
తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి. ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే […]పూర్తి వివరాలు ...
జిల్లాకు మలివిడతలో మంత్రి పదవి వస్తుందని తెదేపా తరపున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాసరెడ్డి (వాసు) ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న విష యమై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఆదివారం వేంపల్లెకు వచ్చిన శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ జమ్మలమడుగు ప్రాంతంలో గానీ, కొప్పర్తి పారిశ్రామిక వాడలో కానీ ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆరు నెలల్లో పాలనాపరమైన అనుమతి […]పూర్తి వివరాలు ...
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా మూడు ట్రిపుల్ ఐటి లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఒకటి కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నాటి ప్రతిపక్షమైన తెదేపా అసెంబ్లీ సాక్షిగా తీవ్రంగా తప్పుపట్టింది. ఆ సందర్భంలో వైఎస్ మాట్లాడుతూ ‘ఏం ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి పెట్టకూడదా? అదేమన్నా పాకిస్తాన్లో ఉందా?’ అంటూ తెదేపా నేతలను ప్రశ్నించారు. అదే సందర్భంలో […]పూర్తి వివరాలు ...
కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన పార్టీల వివరాలు. ఆయా అభ్యర్థులు సాధించిన మెజార్టీ […]పూర్తి వివరాలు ...
చంద్రాబాబు నాయుడు – ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా – పదేళ్లు ప్రతిపక్ష నేతగా వెలిగిన వ్యక్తి. తెదేపాను కనుసైగతో శాసించగలిగిన తిరుగులేని సారధి. ఈ పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి – బహుశా ఇవన్నీ […]పూర్తి వివరాలు ...
జిల్లాలో 20.75 లక్షల ఓటర్లున్నారు.త్వరలో జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 30 శాతంగా ఉన్న యువతరం ఓట్లు మన నేతల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. తొలుత కడప కార్పొరేషన్ , పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో కడప కార్పొరేషన్‌తోపాటు పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు , బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.. ఇక అసెంబ్లీల వారీగా వస్తే బద్వేలు […]పూర్తి వివరాలు ...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. మన కడప జిల్లాలో మే 7వ తేదీన 10 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. మార్చి 9వ తేదీన బూత్ లెవెల్ అధికారులు సమావేశం అవుతారని, ఆరోజున ఎన్నికల జాబితాలను క్షుణ్ణంగా […]పూర్తి వివరాలు ...
విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన […]పూర్తి వివరాలు ...