కడప: యోగివేమన విశ్వవిద్యాలయానికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు దక్కాయి. విశ్వవిద్యాలయ సహాయాచార్యులు ఆరుగురికి యుజిసి(విశ్వవిద్యాలయ నిధుల సంఘం) ‘రామన్ ఫెలోషిప్’లను ప్రకటించింది. ఒక విశ్వవిద్యాలయం నుంచి ఒకేసారి ఆరుగురు ఫెలోషిప్లు దక్కించుకున్న అరుదైన ఘనతను యోగివేమన విశ్వవిద్యాలయం దక్కించుకుంది. యోవేవి సహాయాచార్యులు డాక్టరు తుమ్మల చంద్రశేఖర్, డాక్టరు చంద్రఓబులరెడ్డి, డాక్టరు బి.విజయకుమార్‌నాయుడు, డాక్టరు కె.ఎస్.వి.కృష్ణారావు, డాక్టరు వై.వెంకటసుబ్బయ్య ఫెలోసిఫ్ కు ఎంపికైనారు. ఫెలోషిప్ కు ఎంపికైన ఆచార్యులు అమెరికాలోని పరిశోధనా సంస్థల్లో పరిశోధనలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. […]పూర్తి వివరాలు ...
Tags :yvu
కడప: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా శుక్రవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మనోవిజ్ఞానశాస్త్ర శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సాయంత్రం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని సర్.సి.వి.రామన్ సెమినార్ హాల్లో జరిగే సదస్సునకు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టరు అశోక్‌కుమార్, డాక్టరు వెంకట్రాముడు హాజరవుతున్నారు. ఆసక్తి కలవారు హాజరుకావాలని విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
కడప యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి లక్ష్మీప్రసాద్‌ను దూషించినందుకు తెదేపా నేత, బసవరామతారకం న్యాయ కళాశాల అధిపతి ఎస్.గోవర్ధనరెడ్డిపై పెండ్లిమర్రి పొలీసు స్టేషనులో 506 సెక్షన్ కింద కేసు నమోదైంది. యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి, బాధ్య కులసచివులు ఆచార్య సాంబశివారెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పొలీసులు, ఫిర్యాదుదారుల వివరాల మేరకు పది రోజుల కిందట గోవర్ధన్‌రెడ్డి ఫోన్‌లో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్‌ను […]పూర్తి వివరాలు ...
కడప: బసవతారకం మెమోరియల్ లా కళాశాల అధిపతిగా ఉన్న అధికార తెదేపా నేత గోవర్ధన్ రెడ్డి సహనం కోల్పోయి యోవేవి అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ను మంగళవారం తిట్టినట్లు ఇవాళ ఒక పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. అదే కళాశాలలో ఉన్న (లా కళాశాల) పరీక్షా కేంద్రాన్ని అధికారులు ఈ సారి యోవేవి ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నారు. దాంతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పోవడంతో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం రాబోవు […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థుల వార్షిక పరీక్షలు ఏప్రిల్ రెండు నుంచి మే ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ ఆదేశాల మేరకు ఈ తేదీలు నిర్ణయించామన్నారు. పూర్తిస్థాయి పరీక్షల షెడ్యూలును విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అలానే ఆయా కళాశాలలకు పంపుతామని ఆయన చెప్పారు.పూర్తి వివరాలు ...
కథానిక, నవల, నాటకం ఏదైనా తెలుగు సాహిత్యం సామాజిక చైతన్యానికి- రుగ్మతలు రూపుమాపటానికి ఉపయుక్తమవుతుందని తెలుగు శాఖ సహ ఆచార్యుడు తప్పెట రామప్రసాద్‌రెడ్డి వివరించారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. మూఢాచారాలను రూపుమాపేందుకు సాహిత్యం ఆయుధమన్నారు. 21వ శతాబ్ది సాహిత్యం మరింత పదునైన ఆయుధంగా రూపుదిద్దుకొంటోందని సంతృప్తి వ్యక్తం చేశారు. సమాజం మరింత పురోభివృద్ధి చెందటానికి తనవంతు పాత్ర […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు రెండో రోజు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లో కొనసాగింది. ఈ సదస్సులో తెలుగుశాఖ సమన్వయకర్త ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను జీవన మార్గాలనే మార్చివేసేంతగా సాహిత్యం ప్రభావం చూపిందన్నారు. రైతులు నేత కార్మికులు ఇతర వృత్తి కారులు జీవన విద్వంసానికి గురయ్యారన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికరంగం మనిషిని మనిషిగా బతకనీయకుండా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. పేదలు- ధనికులకు మధ్య పెరుగుతున్న అంతరం […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ’21వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లోని సదస్సుల గదిలో బుధవారం మొదలైంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సమాజ కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆచార్య కుసుమకుమారి మాట్లాడుతూ వికీపిడియా వంటి వెబ్‌సైట్‌లు వేల పుటల్ని సాహిత్య అభిమానులకు అందిస్తున్నాయని వివరించారు. అలాంటి మాధ్యమాలను తెలుగు రచయితలు, పరిశోధకులు తప్పక ఉపయోగించుకోవాలన్నారు. […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య బేతనభట్ల శ్యామ్‌సుందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు, డీన్‌లతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విశ్వవిద్యాలయంలోని కుటుంబసభ్యులందరినీ కలుపుకుని తన శాయశక్తులా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానని తెలిపారు. యోగి వేమన పేరుతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలో పనిచేయడం అదృష్టమన్నారు. ఆయన ప్రబోధనలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధికి పాటుపడతామన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగించి విశ్వవిద్యాలయానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ […]పూర్తి వివరాలు ...