గొణుగుతూ, తిట్టుతూ కడపరాయనితో పంతం బట్టి, మళ్ళా పతికై వయ్యారి చూపులు చూస్తున్న ఆ సతిని చెలికత్తె అనునయించి, కడపరాయని కౌగిలిలో కరిగిపొమ్మని ఇలా ఊరడిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 1124-7 సంపుటము: 21-139 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘సారెనేలే జగడము సారెనేలే’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. సారెనేలే జగడము సారెనేలే సణఁగులు సారెనేలే పతితోఁ బంతము సారెనేలే ॥పల్లవి॥ పెదవుల గొణఁగుచు బీరములాడుచు కొదలుఁదిట్లనే […]పూర్తి వివరాలు ...
Tags :devuni kadapa
కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి, చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 0958-4 సంపుటము: 19-334 ఆడరాని మా టది – అన్నమాచార్య సంకీర్తన ‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ఆడరాని మా టది గుఱుతు వేడుకతోనే విచ్చేయుమనవే ||పల్లవి|| కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ ఆయము లంటిన దది గుఱుతు పాయపుఁబతికినిఁ […]పూర్తి వివరాలు ...
స్వాధీన పతికయైన శృంగార నాయక ఒకతె కడపరాయని లీలలు కొనియాడుచూ, సుతారముగా ఆయనను దెప్పిపొడుస్తూ ‘నీవూ నేనూ ఒకటే కదా. నన్ను చూస్తే నీకెందుకయ్యా అంత భయం’ అంటూ తనని వశపరచుకున్న వైనాన్ని వివరిస్తోంది. అన్నమయ్య గళం నుండి జాలువారిన ఆ సంకీర్తనా మాధుర్యం మీ కోసం… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0277-5 సంపుటము: 9-161 ‘నీకేల వెరపు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నీకేల వెరపు నీవూ […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుని ‘కడపరాయడు’ జగదేక సుందరుడు. కన్నెలు తమ జవ్వనమునే వానికి కప్పముగ చెల్లించినారు. కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. వర్గం: శృంగార సంకీర్తన రేకు: 587-4 సంపుటము: 13-458 రాగము: సాళంగనాట ‘కాదనకు నా మాట’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ ॥పల్లవి॥ కప్పుర మియ్యఁగరాదా కడపరాయా- నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయా-వో […]పూర్తి వివరాలు ...
కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని దర్శనానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి కానుకలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు. బీబీ నాంచారమ్మను తాము కుమార్తెగా భావిస్తామని, ఆ దృష్ట్యా శ్రీనివాసుడు తమకు అల్లుడవుతాడని… ప్రతి ఏటా ఉగాది రోజున ఆయనకు దిన భత్యం సమర్పించి పూజలు నిర్వహించడం […]పూర్తి వివరాలు ...
దేవుని కడప: కడపరాయని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారికి వైభవంగా పుష్పయాగం చేశారు. తితిదే అర్చకులతో పాటు స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా ఉదయం వారికి అభిషేకాలు,పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోష నివారణార్ధం ధ్వజావరోహణ జరిగిన మరుసటి రోజున స్వామి వారికి పుష్పయాగం చేస్తారు. బ్రహ్మోత్సవాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండిపూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో గురువారం (29 జనవరి 2015) నాటి ఉత్సవ కార్యక్రమాలు… ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, అవభృథ స్నానం సాయంత్రం వూంజల్‌సేవ, హంసవాహనసేవ, ధ్వజావరోహణంపూర్తి వివరాలు ...
దేవుని కడప: దేవునికడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై వూరేగారు. ఉదయం నిత్యహోమాలు, బలిహరణం, గ్రామబలి నిర్వహించారు. సాయంత్రం స్నపన తిరుమంజనం, వూంజల్‌సేవ చేసి సేదతీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మచ్ఛాశేషాచార్యులు, మయూరం కృష్ణమాచార్యులు స్వామి వూంజల్‌సేవను, డోలోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వూంజల్‌సేవను తిలకించి భక్తులు తరించారు.పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఐదోరోజు శనివారం నాటి ఉత్సవాలు… ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు, స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం గరుడవాహన సేవ నగరసంకీర్తన ఉత్సవాలలో భాగంగా నగరంలోని ప్రధాన పురపాలక ఉన్నత పాఠశాల వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి అభిషేకోత్సవం, అలంకరణ ఉంటుందని రుక్మిణి పాండురంగ భజన బృందం తెలిపింది. అనంతరం స్వామి గరుడసేవలో పాల్గొనే భక్తులకు అన్నదానం చేయనున్నట్లు కమిటీ పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు భజన బృందంతో అన్నమయ్య విగ్రహం […]పూర్తి వివరాలు ...