Tags :జానపదగీతం

జానపద గీతాలు

అమ్మమ్మో ..నా లడీసు మొగుడూ – జానపదగీతం

వర్గం : జట్టిజాం పాట అనువైన రాగం: నాదనామక్రియ స్వరాలు (తిశ్రగతి) ఏమిసేతురా బగమతి గురుడా మొగుడు ముసలివాడు బెమ్మరాతర రాసిన వానికి తగులును నా ఉసురు అందరి మొగుళ్ళు సెరువుకు పోయి శాపల్ తెచ్చాంటే అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ కాలవకు పోయి కప్పలు తెచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు బీదరు పోయి బిందెలు తెచ్చాంటే నా లడీసు మొగుడూ బీదరు పోయి బిత్తర పోయొచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు పంచల్ కట్కోని […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

డొక్కల కరువును తెలిపే జానపదగీతం

1876-78 సంవత్సరాలలో వచ్చిన కరువును ‘దాతు కరువు’ లేదా ‘డొక్కల కరువు’ లేదా ‘పెద్ద కరువు’ లేదా ‘ముష్టి కరువు’ గా వ్యవహరిస్తారు. తెలుగు సంవత్సరమైన ‘దాత’ లో వచ్చినందున ఈ కరువును ‘దాతు కరువు’ అని వ్యవరించేవారు.  కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా కడుపు మాడ్చుకునేవాళ్ళు. దాంతో సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి ఎముకలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకల గూళ్ళు) మాత్రమే కనపడటం వలన […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

దొరవారి నరసింహ్వరెడ్డి! – జానపదగీతం

దొరవారి నరసింహ్వరెడ్డి! నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహ్వ రెడ్డి! || దొర || రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా దొరవారీ వమిశానా ధీరుడే నరసింహ్వ రెడ్డి || దొర || కొయిల్ కుంట్లా గుట్టలెంటా కుందేరూ వొడ్డూలెంటా గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర || కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

రాసెట్టి రామయ్యను (ఆదోని) గురించిన జానపదగీతం

వర్గం : కోలాటం  పాట బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా ఆదోని తాలూకురా రాసెట్టి వీరన్న కొడుకే రాయల వాడే రామయ్య రామా రామా కోదండరామా భై రామా రామా కోదండరామా రాసెట్టి వీరన్నకయితే ఎంతమంది కొడుకుల్లు ఒగరి పేరు రామయ్య ఒగరి పేరు సుబ్బయ్య అందరికంటే చిన్నావాడు అందగాడూ విశ్వనాధు పన్నెండామడ గడ్డలోన పేరుగల్ల రామయ్య ||రామా|| రామయ్య నేస్తులైన ఎంతమంది ఉన్నారు కొంగనపల్లి కిష్టరావు కోసిగానుమప్ప రా ||రామా|| బుద్ధిశాలి రామయ్య బూమ్మింద […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

దానపరుడూ యంగళరెడ్డి …! – జానపద గీతం

వర్గం:  భిక్షకుల పాట అనువైన  రాగం : సావేరి స్వరాలు (ఏక తాళం ) ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం సూడరయా నేటికి బుడ్డా యంగలరెడ్డి ధర్మ పెబువని పాడరయా దానపరుడూ యంగళరెడ్డి ధర్మదేవత బిడ్డడయా పచ్చి కర్వులో పాసెమూ పోసేను బెమ్మదేవుడే ఆయనయా   ||ఉత్తరాది|| యెచ్చుగానూ పుణ్యాత్ముడు రెడ్దని యంగళరెడ్డిని ఎంచరయా యంగళరెడ్డి దానపరుడని శానామంది పొగిడిరయా   ||ఉత్తరాది|| గుడ్డోల్లకు కుంటోళ్లకు గురుతుగా బండ్లే సేయించేనయా దొడ్డా బుద్ది కలిగిన పెద్ద దొరకు దండామని తెలిపిరయా  […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

దాని సొమ్మేమైన తింటీనా… జానపద గీతం

వర్గం: హాస్య గీతాలు దాని సొమ్మేమైన తింటీనా దానెబ్బ గంటేమైన తింటీనా దీని సొమ్మేమైన తింటీనా ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా దాని సొమ్మేమైన తింటీనా దానెబ్బ గంటేమైన తింటీనా దీని సొమ్మేమైన తింటీనా ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా తెలిసీ తెలియక అమ్మ ఇల్లరికం నేనొస్తి(2) డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే ఆ..డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే కసువూలూడ్సమని బోకుల్దోమమనే ఆ..కసువూలూడ్సమనె బోకుల్దోమమనె వడ్లు దంచమనె మంట బెట్టమనె వంట సేయమనె ఆ..ఈ ఇంటి పనులంటే […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

ఆ.. మాటలంటదే కోడిపిల్ల…! – జానపదగీతం

కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా.. ఆ మాటలంటదే కోడిపిల్ల ఆ.. మాటలంటదే ఆ..లాగనంటదే ఆ..మైన అంటదే ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ మాటలంటదే కోడిపిల్ల!! దిబ్బమీదికొంచబోయి … బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩) అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2) ఆ మాటలంటదే ఆ..లాగనంటదే ఆ మైన అంటదే ఆ లయబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

సై..రా నరసింహారెడ్డి – జానపదగీతం

వర్గం: వీధిగాయకుల పాట పాడటానికి అనువైన రాగం: కాంభోజి స్వరాలు (ఆదితాళం) పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారు కడ్డీ.. రెడ్డీ సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారూ కడ్డీ..రెడ్డీ అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. నారసింహరెడ్డి అరెరే.. ముల్కుల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికి మొనగాడు ఆ.. పెట్టి మాటలు ఏదాలూర రండి శూరులారా.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు ప్రత్యేక వార్తలు

సీమ జానపద గేయాన్ని పవన్ కల్యాణ్ ఖూనీ చేశాడా?

“కాటమరాయుడా..కదిరి నరసిం హుడా” అంటూ పవన్ కల్యాణ్ “అత్తారింటికి దారేదీ” అనే చిత్రం కోసం పాడిన పాట రాయలసీమలో జనులు పాడుకునే ఒక ప్రసిద్ధ జానపదగీతం. కదిరి తాలూకా ఒకప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉండేది. అందువల్ల కడప జిల్లా జానపదులకు కూడా ఈ గీతం బాగా పరిచయమే! శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఈ గీతం వివరిస్తుంది. ఈ గీతాన్ని చక్క భజన కళాకారులూ ఇతర జానపద కళాకారులూ వివిధ పద్దతుల్లో పాడుకొంటూ ఉంటారు.. 1940 లో […]పూర్తి వివరాలు ...

error: