చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి. వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది. “మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి. తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు […]పూర్తి వివరాలు ...
Tags :కడప కథలు
కేతు విశ్వనాథరెడ్డి కథ – రెక్కలు ఆ ‘ముగ్గురూ ఖాకి దుస్తుల్లో ఉన్న ఆడపిల్లలని తెలుస్తూనే ఉంది, వాళ్ళ ఎత్తుల్ని బట్టి, కదలికల్ని బట్టీ, పోలీసు స్టేషన్ ముందు ముసలి కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ ఆ ముగ్గురూ అటూ ఇటూ చూస్తూ నిల్చున్నారు. వాళ్ళకు దగ్గరలోనే మూడు బ్యాగులున్నాయి. మాకులాగే వాళ్ళకు కూడా ఎలక్షన్ డ్యూటీ పడినట్లుంది. మా రూటు లారీ ఆగీ ఆగగానే ఆ ముగ్గురాడపిల్లలూ బ్యాగులు పుచ్చుకొని లారీ వెనకవైపు నుల్బున్నారు. ఇరవై, ఇరవై అయిదేండ్లలోపు […]పూర్తి వివరాలు ...
ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … ఆయప్పది గుండెకాయ కాదు సార్ – ఇనపముద్ద…’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను. ‘‘ఏడీ సురేష్ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే… వాల్ల క్లబ్బులో అయితే కోరిన టిఫిను తినొచ్చునంట. ఇక్కడి గడ్దీగాదం నేనెందుకు తింటా.. ఖర్మా? అక్కడ చికెను మటన్‌తో పులిభోజనం దొరుకుతాంటే.. అని ఎల్లబారి […]పూర్తి వివరాలు ...
‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది. ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’ పూర్తి వివరాలు ...
కూలిన బురుజు ఊరు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన ఊళ్ళోకి అడుగుపెట్టబోతున్నాను. పుట్ట చెండ్లాట మాదిరి నాటుబాంబుల్తో ఆడుకున్న గ్రామ పార్టీల ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నాను. కక్షలూ, కార్పణ్యాల అడవిలోకి వెళుతున్నాను. కొత్త అనుభవం. పదేళ్ళ కిందట జ్ఞాపకాల్లో నిలిచిన ఊరు ఇది కాదనిపిస్తోంది. పక్క కళ్ళాల్లో మేపు కోసం వాముల దగ్గర కొచ్చే రైతుల సందడి లేదు. బండ్ల బాటలో నిత్యం ఎదురవుతుండే ఎద్దుల బండ్ల […]పూర్తి వివరాలు ...
జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్‌ది తంజావూరు, దేశపాండేది పూనా, నాదేమో తెనాలి. నలువురం ఒకే దేశంలోని వాళ్ళమే. అయినా ఉద్యోగాల విషయంగా ఎవరు ఎక్కడుంటామో తెలియదు. అయితే, నిజం ఊహకంటే గొప్పది. […]పూర్తి వివరాలు ...
పైన ఫ్యాను తిరుగుతోంది. తిరిగేది చిన్నగే అయినా కిటకిటా మంటూ శబ్దం పెద్దగా వస్తోంది. ఆ ఫ్యాను గాలిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈగలు బొయ్యిమంటూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. నట్టింట్లో కాళ్లు బార్లా చాపుకుని దిగులుగా కూచోనుంది జమ్రూత్. “పెద్దోడు తిరిగొచ్చాడని పెద్దాసుండ్యా…” అంది ఉన్నట్టుండి. “ఇప్పుడు ఆ ఆసకు ఏమైంది?” అన్నట్టు చూశాడు పక్కనే ఎర్రటి వైరు మంచంపై కూర్చొని ఉన్న ఆమె కొడుకు గౌస్. “ఆ పావురం వొచ్చినట్టే నా బిడ్డకూడా వొచ్చాడనుకొంటి” అంది […]పూర్తి వివరాలు ...
మా జిల్లాల్లో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే ముని లక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి. పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు. కానీ అదేం జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు. అసలు చూడ్డానికి కూడా ఆఫ్రికా అడవి దున్నపోతులా ఉంటాడు. ఆరు అడుగుల ఎత్తు. తెల్ల ఖద్దరు డ్రస్సు. కనుబొమలు, చేతులపై సుడులు తిరిగినపూర్తి వివరాలు ...
సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా […]పూర్తి వివరాలు ...