నాగేశ్వరి

నాగేశ్వరి అసలు వుందా లేదా?

కడప లో సెక్యూరిటీ సర్వీసెస్ రాజా ప్రవీణ్ భార్య నాగేశ్వరి, 7ఏళ్ల కొడుకు గోల్డి గత డిసెంబర్ 10 వ తేది నుండి కనపడటం లేదు. నాగేశ్వరి@ నీలిమ M.A ,B.ed చేసింది. ఆమె తండ్రి retd. head constable వెంకట సుబ్బన్న. ఆయనకు నలుగురు కూతుర్లు,ఒక కొడుకు. అందరు ఉద్యోగస్తులే. నాగేశ్వరి పెళ్లి 2003 లో 2 లక్షల కట్నం, 10 తులాల బంగారు ఇచ్చి ఘనంగా చేసారు.

కానీ సంసారం ఎపుడు గొడవలు, వేధింపులు, స్టేషన్ పంచాయితిలు, పాస్టర్ ల హితువులతో గడిచింది. ఎక్కువ కాలం పుట్ట్టింటి వారి దగ్గరే వుండేవారు. తర్వాత కొద్ది ఏళ్లగా నాగేశ్వరి, ఆమె కొడుకు చిన్న షెడ్ లాంటి ఇంట్లో వుంటే, ఆమె మామ,అత్త,భర్త, ఆడబిడ్డ, నాగేశ్వరి పెద్ద కూతురు అందరు పెద్ద ఇంట్లో వుంటారు. భర్త ఇచ్చే డబ్బులతో ఆమె జీవనం చేసేది. ఇటీవల ఆరు నెలలుగా అతను ఇంటి కిరావటం లేదు. డబ్బులు ఇవ్వటం లేదు. స్కూల్ లో పనిచేయాలనీ ప్రయత్నించి మానుకొంది. ఆమె వున్న ఇంటి దగ్గర కానీ, స్కూల్ లోకానీ, పంచాయితి చేసిన మహిళ సంఘాలు కానీ ,నాగేశ్వరి చాలా నెమ్మది, మంచి స్వభావం అంటున్నారు. ఎవరు కూడా ఆమె గురించి ఒక్క రిమార్క్ కూడా చేయటం లేదు. పోలీసులు కూడా ఈ విషయం ఒప్పుకొంటున్నారు.

కొద్ది రోజులనుండి నాగేశ్వరి నా భర్త నన్ను వేరే ఇంటికి తీసుకెలుతున్నాడు, కూతురు కూడా మాతోనేవుంటుంది అని అందరికి చెప్పింది. అందరు ఇన్నిరోజులకు సంసారం బాగుపడిందని సంతోషపడ్డారు. ఐతే హటాత్తుగా డిసెంబర్ 10 న ఇల్లు వదిలి పోయింది. ఇంట్లో ఎలా వున్న సామాన్లు అలానే వున్నాయి. ఆ రోజు రాత్రి ఓనర్ కు ఫోన్ చేసి రాత్రి కి రావటం లేదని చెప్పింది. మరుసటి రోజు ఉదయం పాలవాడు ఇంట్లో ఈమె లేకపోవటం చూసి, డబ్బులు అడగటానికి ఫోన్ చేసాడు. అత్త్తగారింట్లో వున్నా, త్వరలో వస్తా నంది. 3 వ అక్క ఫోన్ చేస్తే, మళ్ళి చేస్తా,ఇల్లు సర్దుకోవాలి అంది. కానీ ఆరోజు సాయంకాలం నుండి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 12 వ తేది కూడా అలాగే వుండటం తో, 4 వ అమ్మాయి అక్క ఇంటి కెళ్ళి చూసి, అక్కడ లేకుండా పోవటం, అత్తగారింటి కి పోయినదేమోనని అక్కడికి వెళ్లి, బావ కు ఫోన్ చేసి, అక్క గురించి అడిగితె, నాకు తెలిదు అనిజవాబు, ఐతే పోలీస్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పి వెళ్ళింది. తాలూక స్టేషన్ లో 12 రాత్రి 9 గంటలకు ఫిర్యాదు చేసింది.

చదవండి :  మనమింతే!

13 సాయంకాలం 4 వ అమ్మాయి కి, మూడవ అమ్మాయి పాత సెల్ కు నాగేశ్వరి సెల్ నుండి మెసేజ్ వచ్చింది. మీరు నాకు నచ్చని పెళ్లి చేసి నా జీవితం నాశనం చేసారు. మీరంతా హాయిగా వున్నారు. మూడు నెలల కిందట సంతోష్ అనే అతను పరిచయం అయ్యాడు. అతను hyd లో ఉద్యోగం చేస్తాడు. అతను నా కొడుకు ను కూడా చుసుకొంటానని చెప్పాడు. అందుకు అతనితో వెళ్ళిపోతున్నా ,సంక్రాంతి సంబరాలకు తిరిగి వస్తాము, పండుగ చేసుకొందామని వుంది.

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

ఎన్ని సంబందాలు చూసినా వద్దన్ననాగేశ్వరి , ప్రవీణ్ అందం, చదువు (b.tech?), అన్ని వున్నాయని ఇష్టపడి చేసుకొంది. మరి ఎందుకు ఇష్టం లేని పెళ్లి అని అబద్దం మెసేజ్ పెట్టింది?

1o వ తేది ఇల్లు వదిలిన నాగేశ్వరి 13 వరకు కడప లోనే వున్నట్టు సెల్ డేటా బట్టి తెలుస్తోంది. ఆమె ఎక్కడ వున్నట్టు?

10 వ తేదినాడే ,వెళ్లిపోతున్నా అని మెసేజ్ తో స్విచ్ ఆఫ్ ఎందుకు చేయలేదు? పోలీస్ కు ఫిర్యాదు చేసాక ఆఫ్ అయిన ఫోన్ ,ఎందుకు ఒక్కసారే on అయ్యి ఒక్క మెసేజ్ పెట్టి, మళ్ళి ఆఫ్ అయ్యింది?

నెల నెల డబ్బులు ఇస్తున్నా తప్ప నాకు ఎం సంబంధం లేదు అంటున్న భర్త , కనీసం కొడుకు కనపడలేదన్నా ఎందుకు స్టేషన్ కు వెళ్ళలేదు?
ఆయన నెల నెలా 15,౦౦౦. ఇస్తుంటే, పిల్లవాడి బిస్కట్లు కూడా ఎందుకు అప్పు పెట్టింది?ఇంటి అద్దె, బియ్యము, పాలు, డిష్ అన్ని ఎందుకు బకాయి పడింది?

ఆమె కాల్ డేటా మొత్తం, పుట్టింటి వారు, భర్త, ఓనర్, పక్కింటి ఆడవారు లాంటి అన్ని తెలిసిన నెంబర్ లే, మరి ప్రేమికుడు ఎలా మాట్లాడేవాడు? ఒక్కసారి కూడా మగవారితో కనపడలేదని చెబుతున్నారు.

చదవండి :  వైకాపా చతికిలపడిందా?

నవంబర్ మొత్తం ఫాదర్ ప్రకాశం గారి ద్వారా భర్తను కలిసివుండేలా ఒప్పించమని ప్రాదేయపడుతున్న నాగేశ్వరి హటాత్తుగా నిర్ణయం ఎందుకు మార్చుకొని, లేచిపోయింది?

13 ఏళ్లుగా భర్త వేధింపులు భరించిన ఆమె, కనీస వసతులులేని ఇంట్లో కడు బీదగా,ఒంటరిగా బ్రతికిన ఆమె, ముక్కుమొహం తెలియని వాణ్ణి నమ్మి ఎలా వెళ్ళిపోయింది?

కనీసం అక్కచెల్లల్లు కు కూడా చెప్పకుండా ఎలా?

ఇప్పటికి ఎందుకు ఫోన్ చెయ్యకుండా వుంటోంది? అసలు వుందా ? లేదా?

మహిళా పోలీసులు విచారణ పేరుతొ, కాలకృత్యాలు కూడా తీర్చుకోనివ్వటం లేదని,(కొడుతున్నారని కాదు) మానసికంగా వేధిస్తున్నారని హై కోర్ట్ కు వెళ్ళినభర్త, నాగేశ్వరి ఆచూకి గురించి ఎందుకు చిన్న ప్రకటన కూడా ఇవ్వలేడు? గతంలో ఆయన andhrajyothi advertisement లో పనిచేసాడు మరి.

పోలీసుల చుట్టూ తిరుగుతున్న నాగేశ్వరి పుట్టింటి వారికి జవాబు దొరికేదెన్నడు?

ఇంతకుముందు పది రోజులు వాళ్ళ అక్కను దాచిపెట్టి, ఇలాగె నాటకం ఆడారు అంటున్న భర్త , ఎ స్టేషన్ లో, ఎవరి ముందు ఇలా జరిగిందో ఎందుకు చెప్పడు?

s.i. విమలమ్మ, s.i. కౌలుట్లయ్య ,retd. s.i శ్రీరాములు దగ్గర మేము కేసు పెట్టామని నాగేశ్వరి ఇంటి వారు ఆధారాలు చెప్బుతున్నారు. మరి భర్త ఎందుకు చెప్పలేడు?

నిజంగా సంతోష్ తో వెల్లిపోయివుంటే, ఎక్కడ వుంది? ఎలా ఉందన్న ఆలోచన? అక్కడైనా నాగేశ్వరి సంతోషంగా వుందా? అసలు వుందా లేదా ప్రస్తుతానికి శేషప్రశ్న.

  • జయశ్రీ కాకుమాని

(మానవ హక్కుల వేదిక కన్వీనర్)

ఇదీ చదవండి!

పాత కలెక్టరేట్

పాత కలెక్టరేట్ వయసు 132 ఏళ్ళు

కడప నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ పాత భవనాన్ని 1889 సంవత్సరంలో బ్రిటీషువారు నిర్మించారు. అంటే ఈ భవనం వయసు : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: