అది కడప పట్టణానికి ఒకప్పుడు ప్రాణాధారం. కడప ప్రజలకు తియ్యని నీరు అందించే అపురూపమై’నది’. పాలకొండలలోని పెద్ద అగాడి ప్రాంతంలో నీటి బుగ్గలుగా ప్రారంభమై సెలయేరుగా మారి అనేక ప్రాంతాల వారికి దోవలో నీరు ఇస్తూ, చెరువులను నింపుతూ పంటలకు ప్రాణ ధారమై విలసిల్లిన అందాలనది. 500 సంవత్సరాల పూర్వము నుంచి సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఈ నీటి అందాలను చూడటానికి అనేక మంది ఈ ప్రాంతాలకు వచ్చేవారుట. ఎప్పుడూ వరదలతో, ఇసుక దిన్నెలతో […]పూర్తి వివరాలు ...
తాను రాజకీయాల్లో కొనసాగాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు కాబట్టే.. వారి ఆకాంక్ష మేరకు రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ మాజీ మంత్రి, మైదుకూరు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్, తెదేపా కడప పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఎన్నికల గోదాలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం సాయంత్రం తన స్వగ్రామమైన సుంకేశులలో అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో […]పూర్తి వివరాలు ...
దువ్వూరులో సోమవారం డిఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతోపాటు మైదుకూరు తెదేపా ఇన్‌ఛార్జి పుట్టాసుధాకర్‌యాదవ్, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిస్థితులు అందరికి తెలిసిందేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా తెదేపా గెలుపునకు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెదేపా ఎంపీ అభ్యర్థిగా మీరు నిలవాలని కార్యకర్తలు కోరగా పార్టీ ఆదేశాల మేరకే అవి జరుగుతాయని చెప్పారు. దువ్వూరు మండలంలో వీలైనన్ని ఎంపీటీసీలు గెలుచుకోవాలని […]పూర్తి వివరాలు ...
వైకాపా తరపున రాజంపేట శాసనసభ సీటు కోసం చివరి వరకూ ప్రయత్నించి విఫలమైన ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్ఛార్జ్ మేడా మల్లికార్జున రెడ్డి చివరకు తెలుగుదేశం గూటికి చేరారు. ఆదివారం హైదరాబాదులో పసుపు దళపతి చంద్రబాబు సమక్షంలో మేడా సైకిలేక్కారు. దీంతో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు అవకాశాలు మెరుగయ్యాయి. మేడా మల్లి కార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ రాజం పేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బ్రహ్మయ్యతో కలిసి వెళ్లి పార్టీలో చేరారు. వీరు […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ చిరునామా గల్లంతవుతున్న నేపథ్యంలో గౌరవమైన రాజకీయ ప్రస్థానం కోసం మళ్లీ తెదేపాలోకి వచ్చినట్లు వరదరాజులురెడ్డి చెబుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణం వసంతపేటలోని బుశెట్టి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన తెదేపా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన లింగారెడ్డి మాట్లాడుతూ.. సుస్థిరశాంతి, అభివృద్ధి కోసం చేతులు కలిపితే మా కలియిక అపవిత్రమైందంటూ రాజకీయ లబ్ధి కోసం రాచమల్లు ప్రసాద్‌రెడ్డి గొంతుచించుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఎన్నికలు పూర్తికాగానే వైకాపా […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చే నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో మంతనాలు సాగిస్తున్నారు. జిల్లాలో మకాం వేసిన సీఎం రమేష్ సమీకరణలు కూడగట్టడంలో తలమునకలయ్యారు.కందుల సోదరులు, మేడా మల్లిఖార్జునరెడ్డి, వీరశివారెడ్డి, రమేష్ రెడ్డి (రాయచోటి) సహా పలువురు కాంగ్రెస్ నేతలను దేశంలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తునారు. ఇప్పటికే వరదరాజులరెడ్డిని పార్టీలో చేర్చుకున్న దేశం నేతలు మిగిలిన వారిపై దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం వీరశివారెడ్డిని కలిసి […]పూర్తి వివరాలు ...
శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పరిస్థితి కడప జిల్లాలో దయనీయంగా మారింది. ఈనెల 30న జరిగే పురపాలక పోరులో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే నాధుడే కరవయ్యారు. జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య రెండంకెలకు మించలేదు. ముఖ్యంగా మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాల్టీల్లో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది. కడప కార్పొరేషన్లో 50 డివిజన్లకు […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలోని అమీన్ పీర్ (పెద్ద) దర్గాలో హజరత్ సూఫిసర్ మస్త్‌షా చిల్లాకష్ ఖ్యాజా సయ్యద్ షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాలు కొద్ది సేపటి క్రితం ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మలంగ్‌షాను పీరి మీద పీఠాధిపతి ఆసీనులు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కళకళలాడింది. ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రస్తుత పీఠాధిపతి రాత్రి 10 గంటలకు గంధం సమర్పించి […]పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు రెండో రోజు సి.వి.రామన్ విజ్ఞాన భవన్లో కొనసాగింది. ఈ సదస్సులో తెలుగుశాఖ సమన్వయకర్త ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను జీవన మార్గాలనే మార్చివేసేంతగా సాహిత్యం ప్రభావం చూపిందన్నారు. రైతులు నేత కార్మికులు ఇతర వృత్తి కారులు జీవన విద్వంసానికి గురయ్యారన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికరంగం మనిషిని మనిషిగా బతకనీయకుండా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. పేదలు- ధనికులకు మధ్య పెరుగుతున్న అంతరం […]పూర్తి వివరాలు ...