॥పల్లవి॥తలఁపు కామాతురత్వముమీఁదనలవడిన-నిల నెట్టివారైన నేలాగు గారు॥చ1॥ఓలినిరువురుసతుల నాలింగనముసేయలోలుఁడటుగాన నాలుగుచేతులాయవేలసంఖ్యలు సతుల వేడుకల రమియింపఁబాలుపడెఁగాన రూపములు పెక్కాయ॥చ2॥పొలయలుకకూటముల భోగి దా నటుగానమలసి యొక్కొకవేళ మారుమొగమాయలలితలావణ్యలీలావిగ్రహముగానికొలఁది వెట్టఁగరానిగోళ్ళు నిడుపాయ॥చ3॥చిరభోగసౌఖ్యములఁ జెంద ననుభవిగానతిరువేంకటాచలాధీశ్వరుండాయపరగ సంసారసంపదకు బద్ధుఁడు గానఅరుదుగా సకలాంతరాత్మకుండాయ రాగము: వరాళి రేకు: 0017-05 సంపుటము: 1-105 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥మానుషము గాదు మఱి దైవికము గానిరానున్నా అది రాకుమన్నఁ బోదు॥చ1॥అనుభవనకుఁ బ్రాప్తమైనదితనకుఁదానె వచ్చి తగిలికాని పోదు॥చ2॥తిరువేంకటగిరిదేవుని-కరుణచేతఁ గాని కలుష మింతయుఁ బోదు రాగము: గుండక్రియ రేకు: 0001-06 సంపుటము: 1-6 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎట్టుచేసినఁ జేసె నేమి సేయఁగవచ్చుచుట్టపువిరోధంబు సునాస్త్రుచ్రెలిమి॥చ1॥ఒడలిలోపలిరోగ మొనరఁ బరితాపంబుకడుపులోపలిపుండు కడలేనియాసతడిపాఁత మెడగోఁత తలఁపు విషయాసక్తిగుడిమీఁదితరువు ఆలకులము ప్రాణలకు॥చ2॥నీడలోపల యెండ నెలకొన్న బంధంబుగోడపై సున్నంబు కొదలేని యెఱుకపాడూరిలో బ్రదుకు పాపకర్మపుబుద్దితాడుపై తపసు తమధనము ప్రాణులకు॥చ3॥మంటఁజేసిన బొమ్మమనికి సంసారంబురెంటికినిగాని వీరిడికొలువు బ్రదుకుయింటివేలుపు వేంకటేశుఁ గొలువక పరుల-వెంటఁ దిరుగుట వోడ విడిచి వదరిడుట రాగము: బౌళి రేకు: 0017-04 సంపుటము: 1-104 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వేదం బెవ్వని వెదకెడినిఆ దేవునిఁ గొనియాడుఁడీ॥చ1॥అలరిన చైతన్యాత్మకుఁడెవ్వఁడుకలఁ డెవ్వఁ డెచటఁ గలఁడనినతలఁతు రెవ్వనినిఁ దనువియోగదశయిల నాతని భజియించుఁడీ॥చ2॥కడఁగి సకలరక్షకుఁడిం దెవ్వఁడువడి నింతయు నెవ్వనిమయముపిడికిట తృప్తులు పితరులెవ్వనినిఁదడవిన, ఘనుఁడాతనిఁ గనుఁడీ॥చ3॥కదిసి సకలలోకంబులవారలుయిదివో కొలిచెద రెవ్వనినిత్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతివెదకి వెదకి సేవించుఁడీ రాగము: పాడి రేకు: 0001-05 సంపుటము: 1-5 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, పాడిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥చక్కఁదనములువారి సతులాలయిక్కువ తెక్వువల మీ రేమిసేసే రిఁకను॥చ1॥ఒప్పుగా నరకము మాకు బళిచ్చి మనమెల్లకప్పము గొంటిరిగా యంగనలారఅప్పుడే గోవిందునికి ఆహి వెట్టితిఁ జిత్తముయుప్పుడు యెమ్మెల మీ రేమి సేసేరిఁకను॥చ2॥పంచమహాపాతకాలబారిఁ దోసి మాసిగ్గులులంచము గొంటిరిగా నెలఁతలారవంచనతోడుత హరివారమైతి మిఁక మీయుంచుకగుట్టుల మీరెందు చోచ్చే రిఁక॥చ3॥దొంగిలి మాగుట్టులెల్లా దోవ వేసి మరుబారిభంగ పెట్టితిరిగా వోభామలారచెంగలించి వేంకటేశుసేవకుఁ జొచ్చితిమియెంగిలి మోవులును మీ రేడఁబడే రిఁకను రాగము: సామంతం రేకు: 0017-03 సంపుటము: 1-103 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏవం శ్రుతిమత మిదమేవ త-ద్భావయితు మతఃపరం నాస్తి॥చ1॥అతుల జన్మభోగాసక్తానాంహిత వైభవసుఖ మిదమేవసతతం శ్రీహరిసంకీర్తనం త-ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి॥చ2॥బహుళమరణపరిభవచిత్తా నా-మిహపరసాధన మిదమేవఅహిశయనమనోహరసేవా త-ద్విహరణం వినా విధిరపి నాస్తి॥చ3॥సంసారదురితజాడ్యపరాణాంహింసావిరహిత మిదమేవకంసాంతక వేంకటగిరిపతేః ప్ర-శంసైవా పశ్చా దిహ నాస్తి రాగము: సామంతం రేకు: 0001-04 సంపుటము: 1-4 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏది తుద దీనికేది మొదలుపాదుకొను హరి మాయఁ బరగు జీవునికి॥చ1॥ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములుయెన్ని వేదనలు మరియెన్ని దుఃఖములుయెన్ని పరితాపంబు లెన్నిదలపోఁతలుయెన్ని చూచిన మరియు నెన్నైనఁ గలవు॥చ2॥యెన్ని కొలువులు దనకు నెన్ని యనుచరణలుయెన్ని యాసలు మరియు నెన్ని మోహములుయెన్ని గర్వములు దనకెన్ని దైన్యంబులివిఇన్నియునుఁ దలఁప మరి యెన్నైనఁ గలవు॥చ3॥యెన్నిటికిఁ జింతించు నెన్నిటికి హర్షించునెన్నిటికి నాసించు నెన్నిటికిఁ దిరుగుయిన్నియును దిరు వేంకటేశులీలలు గాఁగ_నెన్ని చూచినను దా నెవ్వఁడునుగాఁడు రాగము: బౌళి రేకు: 0017-02 సంపుటము: 1-102 Tags: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥హీనదశలఁబొంది యిట్ల నుండుటకంటెనానావిధులను నున్ననాఁడే మేలు॥చ1॥అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టిపరిభవములనెల్లఁ బడితిఁ గానియిరవైనచింత నాఁడింతలేదు యీ-నరజన్మముకంటె నాఁడే మేలు॥చ2॥తొలఁగక హేయజంతువులయందుఁ బుట్టిపలువేదనలనెల్లఁ బడితిఁగానికలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁగినలఁగి తిరుగుకంటె నాఁడే మేలు॥చ3॥కూపనరకమున గుంగి వెనకకు నేఁబాపవిధులనెల్లఁ బడితిఁగానియేపునఁ దిరువేంకటేశ నా కిటువలెనాపాలఁ గలిగినాఁడే మేలు రాగము: దేసాక్షి రేకు: 0001-03 సంపుటము: 1-3 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏఁటికి దలఁకెద రిందరునుగాఁటపు సిరులివి కానరో ప్రజలు॥చ1॥ఎండలఁ బొరలక యేచిన చలిలోనుండక చరిలోనుడుకకఅండనున్న హరి నాత్మఁదలఁచినపండిన పసిఁడే బ్రతుకరో ప్రజలు॥చ2॥అడవుల నలియక ఆకునలముఁదినికడుపులు గాలఁగఁ గరఁగకబడి బడి లక్ష్మిపతికి దాసులైపొడవగు పదవులఁ బొందరో ప్రజలు॥చ3॥పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగదిక్కులనంతటఁ దిరుగకగక్కన తిరువేంకటగిరిపతిఁ గనివొక్క మనసుతో నుండరొ ప్రజలు రాగము: ఆహిరి రేకు: 0017-01 సంపుటము: 1-101 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...