॥పల్లవి॥నగుఁబాట్లఁ బడేనాజిహ్వపగటున నిదివో పావనమాయlink॥చ1॥ఇల నిందరి నుతియించి పెంచువలెనలినలియైనది నా జిహ్వనలినోదరుశ్రీనామము దలఁచిన-ఫలమున కిదివో పావనమాయ॥చ2॥భ్రమఁబడి మాయపుపడఁతులతమ్మలునమలి చవులుగొనె నాజిహ్వఅమరవంద్యుఁడగుహరి నుతియించఁగప్రమదము చవిగొని పావనమాయ॥చ3॥నెలఁతలపలు యోనిద్రవనదులనునలుగడ నీఁదెను నాజిహ్వఅలసి వేంకటనగాధిపయనుచునుపలికినయంతనె పావనమాయ రాగము: ముఖారి రేకు: 0009-02 సంపుటము: 1-56 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్నహితవు చేకొననొల్ల రిందరుvoltaren végbélkúpvoltaren szemcsepp॥చ1॥కడలేని విజ్ఞానగతికిఁ దోడుగారుయెడపుల వారలె యిందరుఅడరిన మోక్షసహయు లెవ్వరు లేరుయిడుమ పాట్లవారె యిందరు॥చ2॥తిరమైన పుణ్యము బోదించేవారు లేరుయెరపులవారే యిందరుతిరువేంకటాచలాధిపుని మీఁది చిత్తమిరపు నేయకపోయి రిందరు రాగము: లలిత రేకు: 0025-06 సంపుటము: 1-154 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంతేకాని లేదుతాముసేసినంత వట్టు తమకుఁ బోరాదు॥చ1॥ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు, వీఁపుబట్టగట్ట మోపు మోఁచి పాటువడ్డా లేదుతట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదుతెట్టఁదెరువున నోరుదెరచినా లేదు॥చ2॥అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతివిడిచి నెత్తుటఁదోగి వీరుఁడైనా లేదుఅడవులెల్లాఁ దిరిగి అలమటించిన లేదుయిడుమపాటుకుఁ జొచ్చి యియ్యకొన్నా లేదు॥చ3॥వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదుమెచ్చులగుఱ్ఱము నెక్కి మెరసినా లేదుయెచ్చరికఁ దిరువేంకటేశుఁ గొలువక వుంటేయిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు రాగము: సామంతం రేకు: 0009-01 సంపుటము: 1-55 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥పోయం గాలము వృథయై పుట్టిన మొదలుం గటకటనీయెడ నామది నిజమై నిటుచుట యెన్నఁ డొకో॥చ1॥కుడిచిన నాఁకలి దీరదు కడువఁగఁ గుడువఁగఁ బైపైకడుఁబొదలెడు దీపన మిది గడచుట యిఁక నెట్లుకుడువక మానుట యెన్నడు కోరికదీరుట యెన్నడుతడయక నీరూపము నేఁ దలఁచుట లెన్నఁడొకో॥చ2॥జీవుఁడుపుట్టిన మొదలునుఁ జేతికి నూఱట చాలకయేవిధమున భుజియించిన నెడయదు దీపనముశ్రీవేంకటపతి నా కిఁక శ్రీకరుణామృత మియ్యకపావనమందదు నామది పాలించంద గదా రాగము: గుండక్రియ రేకు: 0025-05 సంపుటము: 1-153 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥ నీ కథామృతము నా నిరతసేవన నాకు చేకొనుట సకలసంసేవనం బటుగాన ॥చ1॥ ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు- నిదియె వేదసంహితపాఠము యిదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు- నిదియె సంధ్య నాకిదియ జప మటుగాన ॥చ2॥ యిదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు- నిదియె దుఃఖవిరహితమార్గము యిదియె భవరోగహితభేషజము నాకు- నిదియె వుపనిషద్వాక్యపద్దతిగాన ॥చ3॥ యిదియె దానఫల మీఁజాలినది నాకు యిదియే తలఁపఁ బరహితకర్మము యిదియె తిరువేంకటేశ నీసంస్మరణ- మిదియె యిదియె ఇన్నియును నటుగాన రాగము: భూపాళం రేకు: 0008-06 […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥కడుఁ జంచలములు కడునధ్రువములుకడు నల్పములని కాదందురు॥చ1॥కర్మభోధ వికారంబులుధర్మతంత్ర సంధానములుదుర్మదైక సందోహములుకర్మదూరు లివి గాదందురు॥చ2॥పరమభాగవత భవ్యమతులుపరమభోధ సంభావకులుతిరువేంకటగిరిదేవు సేవకులుకరుణాధికు లివి గాదందురు రాగము: గుండక్రియ రేకు: 0025-04 సంపుటము: 1-152 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥వందే వాసుదేవంబృందారకాధీశ వందిత పదాబ్జం॥చ1॥ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-చందనాంకితల సచ్చారు దేహంమందారమాలికా మకుటసంశోభితంకందర్పజనక మరవిందనాభం॥చ2॥ధగధగిత కౌస్తుభాధరణ వక్షస్థలంఖగరాజవాహనం కమలనయనంనిగమాదిసేవితం నిజరూపశేష ప-న్నగరాజ శాయినం ఘన నివాసం॥చ3॥కరిపురనాధ సంరక్షణే తత్పరంకరిరాజ వరదసంగత కరాబ్జంసరసీరుహాననం చక్రవిభ్రాజితంతిరువేంకటాచలా దేవం భజే రాగము: శ్రీరాగం రేకు: 0008-05 సంపుటము: 1-53 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడుకొండలంత వరములు గుప్పెడు వాఁడు॥చ1॥కుమ్మరదాసుఁడైన కురువరతినంబిఇమ్మన్నవరములెల్ల నిచ్చినవాఁడుదొమ్ములు సేసినయట్టి తొండమాంజక్కురవర్తిరమ్మనచోటికి వచ్చి నమ్మినవాఁడు॥చ2॥అచ్చపు వేడుకతోడ ననంతాళువారికిముచ్చిలి వెట్టికి మన్నుమోఁచినవాఁడుమచ్చిక దొలఁకఁ దిరుమలనంబితోడుతనిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు॥చ3॥కంచిలోన నుండఁ దిరుకచ్చినంబిమీఁదఁ గరు-ణించి తనయెడకు రప్పించినవాఁడుయెంచ నెక్కుడైనవేంకటేశుఁడు మనలకుమంచివాఁడై కరుణఁ బాలించినవాఁడు రాగము: సామంతం రేకు: 0025-03 సంపుటము: 1-151 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥చాలదా హరినామ సౌఖ్యామృతము దమకుచాలదా హితవైన చవులెల్ల నొసఁగ॥చ1॥ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదాచెదరకీ జన్మముల చెఱలు విడిపించమది నొకటె హరినామ మంత్రమది చాలఁదాపదివేలు నరకకూపముల వెడిలించ॥చ2॥కలదొకటి హరినామ కనకాద్రి చాలదాతొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచతెలివొకటి హరినామ దీపమది చాలదాకలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల॥చ3॥తగువేంకటేశు కీర్తన మొకటి చాలదాజగములో కల్పభూజంబు వలెనుండసొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదానగవుఁజూపులను నున్నతమెపుడుఁ జూప రాగము: శ్రీరాగం రేకు: 0008-04 సంపుటము: 1-52 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...